IND Vs WI: కెప్టెన్‌గా హార్దిక్.. విరాట్, రోహిత్‌లకు నో ప్లేస్.. టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే..
వెస్టిండీస్‌తో త్వరలో జరిగే టీ 20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్ నుంచి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీలకు తప్పించారు. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా, సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు.
వెస్టిండీస్‌తో త్వరలో జరిగే టీ 20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. మొత్తం 5 మ్యాచ్‌ల టీ20ల సిరీస్ నుంచి వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీలకు తప్పించారు. ఈ సిరీస్‌కు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా, సూర్యకుమార్ యాదవ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. ఐపీఎల్‌లో సత్తాచాటిన గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజూశాంసన్, ఆవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్‌లు పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే కోల్‌కతా సంచలనం రింకూసింగ్‌కు మాత్రం టీ20 జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్‌రౌండర్ అజిత్ అగార్కర్ ఎంపికైన మరుసటి రోజే భారత జట్టును ఎంపిక చేశారు. 2024 టీ 20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి పూర్తిగా యువ ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రోహిత్, విరాట్,మహ్మాద్ షమీ వంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు.
కాగా వెస్టిండీస్‌లో సుదీర్ఘ పర్యటనలో ఉన్న భారత్ ఆతిథ్య జట్టుతో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించగా, ఇప్పుడు కొత్త చీఫ్ సెలక్టర్ రాక ఆధ్వర్యంలో టీ20 జట్టును ప్రకటించారు. ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది
భారత జట్టు:
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
Alert🚨: #TeamIndia‘s squad for T20I series against the West Indies announced. https://t.co/AGs92S3tcz
— BCCI (@BCCI) July 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..