- Telugu News Photo Gallery Cricket photos ICC Test Rankings: Kane Williamson becomes No.1 ranked batter, Steve Smith one point behind, One Indian In Top 10
రోహిత్, కోహ్లీలకు భారీ షాక్.. టాప్ 10లో ఒకే ఒక్క టీమిండియా బ్యాటర్.. అతడెవరో తెలుసా.?
పేలవ ఫామ్‌తో కొనసాగుతోన్న టీమిండియా బ్యాటర్లు తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిపోయారు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో..
Updated on: Jul 05, 2023 | 6:30 PM

పేలవ ఫామ్‌తో కొనసాగుతోన్న టీమిండియా బ్యాటర్లు తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వెనుకబడిపోయారు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ బ్యాటర్లకు భారీ షాక్ తగిలింది. టాప్ 10లో కేవలం ఒకే ఒక్క టీమిండియా బ్యాటర్‌కు చోటు దక్కింది.

ప్రస్తుతం టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్‌లో కేన్ విలియమ్సన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి ఎగబాకాడు.

ఇక మార్నాస్ లబూషెన్, ట్రావిస్ హెడ్, జో రూట్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ ఐదో స్థానం నుండి ఆరో స్థానానికి పడిపోయాడు. టాప్ 10లో ఉన్న భారత్‌కు చెందిన ఏకైక బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.

అటు బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రెండో ప్లేస్‌కు ఎగబాకాడు. ఆ తర్వాత రబడా, అండర్సన్ మూడు, నాలుగు స్థానాల్లో.. రాబిన్‌సన్, షాహీన్ అఫ్రిది, లియాన్ ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియా బౌలర్లు బుమ్రా, జడేజా 8, 9 స్థానాల్లో ఉన్నారు.

ఆల్‌రౌండర్లలో జడేజా అగ్రస్థానం, అశ్విన్ రెండో స్థానంలో నిలిచారు. స్టార్క్, కమిన్స్ 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 4వ స్థానంలో నిలిచాడు.





























