Tilak Varma: తండ్రి ఎలక్ట్రీషియన్.. క్రికెట్ కిట్ కొనలేని పరిస్థితి.. తెలుగబ్బాయి సక్సెస్ వెనక ఇంతటి కష్టముందా?
టీమ్ ఇండియా జెర్సీ ధరించాలని ఎన్నో ఏళ్లుగా కలలుగంటోన్న తెలుగబ్బాయి తిలక్ వర్మ కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. తాజాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసిన బీసీసీఐ తిలక్‌కు స్థానం కల్పించింది. త్వరలోనే అతను వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు.
టీమ్ ఇండియా జెర్సీ ధరించాలని ఎన్నో ఏళ్లుగా కలలుగంటోన్న తెలుగబ్బాయి తిలక్ వర్మ కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. తాజాగా విండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియాను ఎంపిక చేసిన బీసీసీఐ తిలక్‌కు స్థానం కల్పించింది. త్వరలోనే అతను వెస్టిండీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు తిలక్. మొత్తం 11 మ్యాచ్‌ల్లో 343 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సీజన్‌లో తిలక్ స్ట్రైక్ రేట్ 164.11. ఎంత ఒత్తిడిలోనైనా భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఈ లెఫ్ట్ హ్యాండర్ సొంతం. అయితే తిలక్ ఇక్కడి వరకు రావడానికి అతని తండ్రి నాగార్జున కృషి, కష్టం ఎంతో ఉన్నాయి. ఆయన వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయితే తన కుమారుడికి క్రికెట్‌కు ఇష్టమని తెలిసి ఎంతగానో ప్రోత్సహించాడు. తమ కష్టాలను తెలియకుండా డబ్బు పోగు చేసి మరీ తిలక్‌ను స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించాడు. అక్కడ మన తెలుగబ్బాయి ట్యాలెంట్‌ను గుర్తించిన కోచ్ సలామ్ బయాష్ ఒక స్టార్ క్రికెటర్‌గా తీర్చిదిద్దాలనుకున్నాడు. అందులో భాగంగానే కోచింగ్ ఫీజును కూడా తీసుకోకుండా శిక్షణ ఇచ్చాడు. రోజు ఆయనే తన బైక్‌పై తిలక్‌ను తీసుకొచ్చేవాడు.
రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం..
తెల్లవారుజాము ప్రయాణం.. అందులోనూ 40 కిలోమీటర్ల దూరం.. దీంతో చాలాసార్లు కోచ్ బైక్ నడుపుతుండగా, వెనక్కే కూర్చొని నిద్రపోయేవాడు తిలక్. మధ్యలో చాలా సార్లు బైక్ ఆపి నీళ్లతో ముఖం కడుక్కునే వాడు. ఇలా కొన్నేళ్ల పాటు కష్టపడ్డాడు తిలక్. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలమే టీమిండియా జెర్సీ. కేవలం 16 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు తిలక్. 2018-19 రంజీ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అదే ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.
View this post on Instagram
ఆ కష్టం ఊరికే పోలేదు..
బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఈ మెగా క్రికెట్ టోర్నీలోనూ సత్తాచాటాడు తిలక్. ఈక్రమంలోనే ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. అలా 2022లో రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో ఐపీఎల్‌లోకి వచ్చిన తిలక్ 2023లో ఏకంగా రూ. 1.7 కోట్లు పలికాడు. తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తిలక్ ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఆ ట్యాలెంట్‌తోనే టీమిండియాకు ఎంపికయ్యాడు.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..