AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Birthday: అట్లుంటది మరి ధోని క్రేజ్‌ అంటే.. హైదరాబాద్‌, నందిగామలో మిస్టర్‌ కూల్‌ భారీ కటౌట్లు

మహేంద్ర సింగ్‌ ధోని.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా అతని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల ఐపీఎల్‌లో ఈ విషయం నిరూపితమైంది. ధోనిని, అతని ఆటను చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తారు.

MS Dhoni Birthday: అట్లుంటది మరి ధోని క్రేజ్‌ అంటే.. హైదరాబాద్‌, నందిగామలో మిస్టర్‌ కూల్‌ భారీ కటౌట్లు
Ms Dhoni Birthday
M Sivakumar
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 5:24 PM

Share

మహేంద్ర సింగ్‌ ధోని.. క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయినా అతని క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల ఐపీఎల్‌లో ఈ విషయం నిరూపితమైంది. ధోనిని, అతని ఆటను చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తారు. అలాగే ధోని ఆడిన మ్యాచ్‌లన్నీ రికార్డు స్థాయిలో వ్యూయర్‌ షిప్‌ సొంతం చేసుకున్నాయి. అభిమానుల అంచనాలకు తగ్గట్టే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఐదోసారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలబెట్టి మంచి క్రికెట్‌ మజాను అందించాడు మహి. ఇక భారత జట్టుకు ధోని అందించిన సేవలు అజరామరం. ధనాధన్‌ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌గా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఈ కారణంగానే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ధోనికి అభిమానులున్నారు. కాగా శుక్రవారం (జులై 7) మిస్టర్ కూల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ధోని బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో 52 అడుగుల ధోనీ భారీ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. ధోని బర్త్‌డే సందర్భంగా శుక్రవారం దీనిని ఆవిష్కరించనున్నారు. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ధోని బ్యాట్‌ పట్టుకుని క్రీజులోకి వస్తోన్న పోజుతో ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్‌ గ్రాండ్‌గా జరగనున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఏకంగా 77 అడుగుల ధోని భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. అంబారుపేట గ్రామానికి చెందిన ధోనీ అభిమానులతో సుమారు రూ.40 వేలు వెచ్చించి ఈ కటౌట్‌ను ఏర్పాటుచేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ డ్రస్ తో ఉన్న కటౌట్ ఏర్పాటు చేశామంటున్నారు అభిమానులు. ఈరోజు సాయంత్రం బైక్ ర్యాలీ నిర్వహించి రేపు గ్రాండ్ గా ధోనీ కటౌట్‌ను ఆవిష్కరిస్తామంటున్నారు ఫ్యాన్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?