Pawan Kalyan: ఒక్క ఫొటోతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్

జనసేన అధ్యక్షులు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మూడో భార్య అన్నా లెజినెవాతో విడిపోతున్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని సోషల్‌ మీడియాలో రూమర్లు తెగ హల్‌చల్‌ చేశాయి. అయితే ఒక్క ఫొటోలో ఈ పుకార్లకు చెక్‌ పెట్టేశారు పవన్‌ కల్యాణ్‌.

Pawan Kalyan: ఒక్క ఫొటోతో ఆ పుకార్లకు చెక్‌ పెట్టిన పవన్‌ కల్యాణ్‌.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్
Pawan Kalyan, Anna Lezhneva
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 7:30 PM

జనసేన అధ్యక్షులు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మూడో భార్య అన్నా లెజినెవాతో విడిపోతున్నారని గత రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని సోషల్‌ మీడియాలో రూమర్లు తెగ హల్‌చల్‌ చేశాయి. అయితే ఒక్క ఫొటోలో ఈ పుకార్లకు చెక్‌ పెట్టేశారు పవన్‌ కల్యాణ్‌. పవన్‌ తన భార్యతో కలిసి పూజలు చేస్తోన్న ఒక ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది జనసేన. ‘జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కల్యాణ్‌, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు పవన్‌ కల్యాణ్‌ త్వరలో మంగళగిరి చేరుకుంటారు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది జనసేన.

కాగా రష్యాకు చెందిన అన్నా లెజినోవాను 2013లో పెళ్లి చేసుకున్నారు పవన్‌ కల్యాణ్‌. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇటీవల ఈ దంపతులు విడిపోయారని పుకార్లు షికార్లు చేశాయి. అందుకే లెజినోవా ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉంటున్నారని కొన్ని నేషనల్‌ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. విడిగా ఉన్న కారణంగానే వరుణ్‌ తేజ్‌ నిశ్చితార్థం ఫంక్షన్‌కు పవన్‌ ఒక్కరే వచ్చారని కథనాల్లో పేర్కొన్నాయి. అలాగే రామ్ చరణ్-ఉపాసనలకు కూతురు పుడితే కూడా పవన్‌ ఒక్కరే వచ్చాడు. ఇక వారాహి యాత్ర ప్రారంభోత్సవంలోనూ లెజినోవా కనిపించలేదంటూ నెట్టింట పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే ఒక్క ఫొటోతో ఈ రూమర్లకు చెక్‌ పెట్టాడు పవన్‌ కల్యాణ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే