Bullet Bhaskar: టీవీషోలో వైసీపీ సర్కారుపై సెటైర్లు.. క్షమాపణలు చెప్పిన జబర్దస్త్ కమెడియన్‌

జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో బుల్లెట్‌ భాస్కర్‌ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా పనిచేసిన ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు.

Bullet Bhaskar: టీవీషోలో వైసీపీ సర్కారుపై సెటైర్లు.. క్షమాపణలు చెప్పిన జబర్దస్త్ కమెడియన్‌
Bullet Bhaskar
Follow us
Basha Shek

|

Updated on: Jul 04, 2023 | 8:58 PM

జబర్దస్త్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో బుల్లెట్‌ భాస్కర్‌ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా పనిచేసిన ఆయన మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. మొదట రాకెట్‌ రాఘవ, చలాకీ చంటి టీమ్‌లలో స్క్రిప్ట్‌ రైటర్‌గా వచ్చిన భాస్కర్‌ ఆ తర్వాత కంటెస్టుగా, టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం జబర్దస్త్ టాప్‌ కమెడియన్లలో బుల్లెట్‌ భాస్కర్‌ ఒకరు. కాగా ఇటీవల విడుదలైన ఓ ప్రోమోలో బుల్లెట్‌ భాస్కర్‌ చెప్పిన పంచ్‌ డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉన్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు బుల్లెట్‌ భాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు ఆ ప్రోమోలో ఏముందంటే.. లేటెస్ట్‌ స్కిట్‌లో బుల్లెట్‌ భాస్కర్‌తో పాటు నరేష్‌, అతని తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్‌ ఏశారు. స్కిట్టులో భాగంగా ఒకామె ‘బావ గారూ నన్ను మూవీకి తీసుకెళతారా?’ అని భాస్కర్‌ తండ్రిని అడుగుతుంది. దీనికి ‘సెకెండ్‌ షోకు వెళ్లకమ్మా.. ఆయనకు రేచీకటి’ అంటూ భాస్కర్‌ తల్లి రిప్లై ఇస్తుంది.

ఆ తర్వాత ఆయనకు నెల ఆదాయం ఎంత? అని నటి అడగ్గానే.. ‘రూ. 2750 వస్తుంది’ అని చెబుతుంది భాస్కర్‌ తల్లి. అదేంటి మరేమీ పెరగదా? అంటే ‘ ప్రభుత్వం మారితే పెన్షన్‌ పెరుగుతుంది’ అని భాస్కర్‌ తల్లి సమాధానం చెబుతుంది. ఇప్పుడిదే వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. బుల్లెట్‌ భాస్కర్‌పై జగన్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా మండిపడుతున్నారు. ఏపీలో వృద్ధ్యాప్య పెన్షన్‌ ను ఉద్దేశించి ఈ డైలాగులు ఉన్నాయంటూ నెట్టింట భారీగా ట్రోల్‌ చేస్తున్నారు. స్కిట్ల పేరుతో ప్రభుత్వంపై సెటైర్లు వేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. వైసీపీ శ్రేణుల ఆగ్రహాన్ని గుర్తించిన బుల్లెట్‌ భాస్కర్‌ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. ‘ వైసీపీ శ్రేణులు, కార్యకర్తలందరికీ మా అమ్మ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. అది ఫ్లోలో అన్నదే కానీ.. ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చెప్పింది కాదు. చాలా సాధారణంగా అన్నపదం. దీని వల్ల ఎవరైనా ఫీలయినా, మనోభావాలు దెబ్బతింటే వారికి నా తల్లి తరఫున, నా తరఫున క్షమాపణలు చెబుతున్నాను. ప్రోమోలో డైలాగులు డిలీల్‌ చేయమని మా టీం వాళ్లకు కూడా చెప్పాను. కాబట్టి వచ్చే ఎపిసోడ్‌లో కూడా ఈ డైలాగులు ఉండవు. థ్యాంక్యూ. థ్యాంక్యూ సో మచ్‌’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు భాస్కర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..