Oh My God 2: శివుడిగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. అక్షయ్‌ కుమార్‌ ‘ఓ మై గాడ్‌ 2’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఇదే..

అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్' చిత్రం 2012లో విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ హీరోలుగా గోపాల గోపాల పేరుతో రిలీజై విజయం సాధించింది.

Oh My God 2: శివుడిగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. అక్షయ్‌ కుమార్‌ 'ఓ మై గాడ్‌ 2' మూవీ రిలీజ్‌ డేట్‌ ఇదే..
Akshay Kumar
Follow us
Basha Shek

|

Updated on: Jul 03, 2023 | 9:11 PM

అక్షయ్ కుమార్ నటించిన ‘ఓ మై గాడ్’ చిత్రం 2012లో విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. తెలుగులో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, వెంకటేష్‌ హీరోలుగా గోపాల గోపాల పేరుతో రిలీజై విజయం సాధించింది. ఇప్పుడు ఓ మై గాడ్‌ సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సారి అక్షయ్‌ శివుడి అవతారంలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఓమైగాడ్‌ 2 సంబంధించిన పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. కాగా 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ తర్వాత అక్షయ్‌ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’ వంటి అనేక ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చాయి. ఇక ఈ ఏడాది విడుదలైన ‘సెల్ఫీ’ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అక్షయ్‌ ఆశలన్నీ ఓమైగాడ్‌ సీక్వెల్‌ మీదనే ఉన్నాయి.

కాగా రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఆ సినిమా రేసు నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే ‘ఓఎంజీ 2’ రేసులోకి వచ్చింది. ఆగస్ట్ 15న సెలవు ఉండడంతో సినిమా కలెక్షన్లు పెరిగేందుకు దోహపపడుతుందన్న కారణంతో మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. అమిత్ రాయ్ ‘OMG 2’కి దర్శకత్వం వహిస్తున్నారు. శివ పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా, పంకజ్ త్రిపాఠి, అరుణ్ గోవిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమా విజయం అక్షయ్‌కు అత్యంత కీలకం. అందుకే భారీగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు
ఓరీ దేవుడో ఈ పంటి ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లే..!ప్రపంచంలోనే ఖరీదు