AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2: గుర్తుపెట్టుకోండి.. వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకుని.. ‘యాత్ర 2’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌..

వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలు చివరకు హెలికాప్టర్‌లో ప్రమాదవశాత్తూ చనిపోవడంతో యాత్ర సినిమా ముగుస్తుంది. కాగా అప్పట్లోనే యాత్రకు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మహి.వి.రాఘవ్‌.

Yatra 2: గుర్తుపెట్టుకోండి.. వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకుని.. 'యాత్ర 2' రిలీజ్‌ డేట్‌ వచ్చేసిందోచ్‌..
Yatra 2 Movie
Basha Shek
|

Updated on: Jul 02, 2023 | 3:20 PM

Share

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. మహి. వి. రాఘవ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ బయోపిక్‌లో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి వైఎస్సార్‌ పాత్రలో నటించి మెప్పించారు. సుమారు నాలుగేళ్ల (2019) క్రితం విడుదలైన యాత్ర మూవీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం, ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలు చివరకు హెలికాప్టర్‌లో ప్రమాదవశాత్తూ చనిపోవడంతో యాత్ర సినిమా ముగుస్తుంది. కాగా అప్పట్లోనే యాత్రకు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు మహి.వి.రాఘవ్‌. వైఎస్సార్‌ మరణం తర్వాతి పరిణామాలు,  జగన్‌ పాదయాత్ర తదితర అంశాలతో యాత్ర 2 తెరకెక్కిస్తానన్నాడు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్‌ రాలేదు. అచితూ ఇటీవల ‘సైతాన్‌’ సిరీస్‌ రిలీజ్‌ సమయంలో యాత్ర సీక్వెల్‌ త్వరలోనే ప్రారంభిస్తానని డైరెక్టర్‌ చెప్పాడు. దీంతో కొన్ని రోజుల నుంచి యాత్ర 2 పేరు నెట్టింట మార్మోగిపోతోంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8న యాత్ర 2 అప్డేట్‌ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అయితే అంతకన్నా ముందే ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు డైరెక్టర్‌.

తాజాగా యాత్ర 2 రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు మహి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాత్ర సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజైన పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వై.ఎస్‌. రాజవేఖర రెడ్డి కొడుకుని’ అనే లైన్స్‌ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. వైఎస్‌ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠం చేపట్డం తదితర అంశాలను యాత్ర 2 లో చూపించనున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చనున్నారు. కోలీవుడ్ హీరో జీవా సీఎం జగన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..