AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Maps: ఇది కదా కావాల్సింది.. గూగుల్ మ్యాప్స్‌లో ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..

వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు గూగుల్‌ ఎప్పికప్పుడూ కొత్త కొత్త అప్‌డేట్స్‌ను తీసుకోస్తుంది. తాజాగా గూగుల్‌ తన మ్యాప్ యాప్‌లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్స్‌ సాధారణ సెర్చ్ బార్ లాగా కాకుండా, మీరు చాట్ చేస్తున్నట్లుగా క్లిష్టమైన ప్రశ్నలను అడగడానికి అనుమతిస్తుంది. ఇది మీరు రూట్‌లను అర్థం చేసుకోవడాన్ని మరింత సులభతరం చేస్తోంది.

Google Maps: ఇది కదా కావాల్సింది.. గూగుల్ మ్యాప్స్‌లో ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
Google Maps Updates
Anand T
|

Updated on: Mar 13, 2026 | 4:12 PM

Share

గూగుల్ ముఖ్యంగా తన మ్యాప్ యాప్‌లో రెండు కొత్త జెమిని ఏఐ ఫీచర్స్‌ను జోడించింది. ఇవి కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందిస్తాయి. ఈ మేరకు గూగుల్‌ రెండు ఏఐ ఫీచర్‌లైన ఆస్క్‌ మ్యాప్స్, ఇమ్మెర్సివ్‌ నేవిగేషన్‌ అనే ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త ఫీచర్ ప్రస్తుతం అమెరికా, భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐవోఎస్ పరికరాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు మీ దగ్గర్లోని రెస్టారెంట్‌లు, కేఫ్‌లు వాటి రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తుంది. అలాగే మీరు ఆ లొకేషన్‌కు వెళ్లేందుకు సార్ట్‌కట్ రూట్స్‌ను కూడా చెప్తోంది.

ఈ కొత్త ఫీచర్స్‌ ఏంటి ఎలా ఉపయోగపడుతాయి.

ఆస్క్‌ మాప్స్: జెమినీ ఏఐతో కలిసి గూగుల్ తన మ్యాప్ యాప్‌లో తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ ‘ఆస్క్ మాప్స్’. ఇది కేవలం ఒక సెర్చ్ బార్ లా కాకుండా, మీరు చాట్‌బాట్‌లా పనిచేస్తుంది. దీనితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. మ్యాప్స్‌కు సంబంధించి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు అది సమాధానం చెబుతోంది. ఇందుకోసం మీరు మ్యాప్స్‌లో ఉన్న ‘ఆస్క్ మాప్స్’ బటన్‌ మీ నొక్కి, మీకు కావలసిన సమాచారం గురించి అడగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ప్రదేశాలు, 50 కోట్ల మంది కంట్రిబ్యూటర్ల సమాచారాన్ని ఉపయోగించి జెమినీ ఏఐ మీకు సరైన సమాధానాలను అందిస్తుంది. ఉదాహరణకు మీరు మూడు గంటల పాటు ప్రయాణించేలా ఉంటే మధ్యలో లంచ్ చేయడానికి లేదా కాఫీ తాగడానికి వీలుగా ఉన్న ఫ్యామిలీ హైకింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగితే అది మీకు బెస్ట్‌ స్టేస్‌లను సజెస్ట్ చేస్తుంది.

ఇమ్మర్సివ్ నావిగేషన్ : ఆస్క్ మ్యాప్స్‌తో పాటు, గూగుల్ ఇమ్మర్సివ్ నావిగేషన్‌ను అనే ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది, గత పదేళ్లలో డ్రైవింగ్, రూట్ గైడెన్స్‌లో ఇదే అతిపెద్ద మార్పు అని గూగుల్ పేర్కొంది. ఈ ఫీచర్‌లో మీరు జెమిని మోడల్స్ సపోర్ట్‌తో స్ట్రీట్ వ్యూ, ఏరియల్ ఫోటోలను కలిపి, రోడ్లు, భవనాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ల్యాండ్‌మార్క్‌లను రియలిస్టిక్‌గా 3D రూపంలో చూపవచ్చు. ఈ ఫీచర్ వల్ల క్లిష్టమైన టర్నింగ్ వద్ద డ్రైవర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఏ లేన్‌లో వెళ్లాలో స్పష్టంగా అర్థమవుతుంది.

ఇమ్మర్సివ్ నావిగేషన్ ఫీచర్ అనేది ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం వాకింగ్, సైక్లింగ్ మార్గాల కోసం యాజ్ అవుతుంది. దీన్ని త్వరలో ఆండ్రాయిడ్ ఆటో, కార్‌ప్లే వంటి వాహన ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకురానున్నట్టు గూగుల్ పేర్కొంది.

మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us