AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్రం ప్రకటన.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..

పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు నిధులు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రధాని మోదీ స్వయంగా నిధులు రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాల్లో ప్రకటన చేసింది.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలపై కేంద్రం ప్రకటన.. ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు.. రెడీగా ఉండండి..
Pm Kisan 23rd Installment
Venkatrao Lella
|

Updated on: Jun 18, 2026 | 8:17 AM

Share

దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నగదును జూన్ 20వ తేదీన లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ ద్వారా దేశంలోని అన్నదాతలకు అందించనుంది. ఈ మేరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక ఎక్స్ ఖాతాలో దీని గురించి ప్రకటన చేశారు. అలాగే అగ్రికల్చర్ ఇండియా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఎక్స్ అకౌంట్లో కూడా దీని గురించి ప్రకటన వచ్చింది.

రైతుల ఖాతాల్లో జమ

“ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 23వ విడత నగదును జూన్ 20న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో విడుదల కానుంది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా భారతదేశంలోని అన్నదాతలకు సాధికారత కల్పించడంలో మనం మరో మైలురాయి వైపు పయనిస్తున్నందున తాజా సమాచారం కోసం వేచి ఉండండి” అంటూ ఎక్స్‌లో ప్రకటన చేశారు. 22వ విడత నగదును అసోంలోని గువహటి వేదికగా మార్చి 13వ తేదీన మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల 46 లక్షల 15 వేల 309 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. రూ.4.28 లక్షలకుపైగా ఆర్ధిక సాయం చేశారు. ఇందులో రూ.1.01 లక్షల కోట్ల మంది మహిళా లబ్దిదారులు ఉన్నారు.

రెండు రోజులే టైమ్

ఇక రెండు రోజులు మాత్రమే పీఎం కిసాన్ నిధుల విడుదలకు టైమ్ మిగిలి ఉంది. దీంతో రైతులు ఈ నగదు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నైరుతి రుతుపవనాల రాకతో రైతులు పంటలు వేస్తున్నారు. పీఎం కిసాన్ నగదు రైతుల పెట్టుబడికి ఉపయోగపడనుంది. రూ.2 వేలను రైతు ఖాతాల్లో వేయనున్నారు. పీఎం కిసాన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు 18001801551 హెల్ప్ లైన్ నెంబర్‌ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇది అందుబాటులో ఉంటుంది.155261 నెంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. ఇక పీఎం కిసాన్ అధికార వెబ్ సైట్, యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. మీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ చెక్ చేసుకోవడం వల్ల మీకు నిధులు వస్తాయా.. లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే సమస్యల ఉంటే అందులోనే ఫిర్యాదు చేయవచ్చు.

Follow Us
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. కేంద్రం ప్రకటన
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..