AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబుతో స్పోర్ట్స్ డ్రామా.. వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబుతో స్పోర్ట్స్ డ్రామా.. వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 8:07 AM

Share

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్నా వారణాసి సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది. దుర్గ ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై డా.కె.ఎల్.నారాయణ, ఎస్.ఎస్.కార్తికేయ వారణాసి సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంక మందాకినీ పాత్రలో నటిస్తుంది. అలాగే కుంభ అనే నెగిటివ్ పాత్రలో పృథ్వీరాజ్కనిపించనున్నారు.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

అలాగే వారణాసి సినిమాలో మహేష్ బాబు రెండు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రాముడిగా మహేష్ బాబు కనిపించనున్నాడని రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వారణాసి సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లిస్ట్ లో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

యానిమల్ సినిమా సమయంలోనే మహేష్ బాబుతో సందీప్ సినిమా చేయాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పారు. దాంతో వారణాసి సినిమా తర్వాత సందీప్ సినిమా ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. అలాగే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి అనిల్ తో మహేష్ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈవార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
వారణాసి తర్వాత సూపర్ స్టార్ కోసం ఆ దర్శకుడు రెడీ.?
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?