AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్. చాలా మంది సినీసెలబ్రెటీలు ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు తెలుగుతో పాటు హిందీ లోనూ కొంతమంది పెళ్లిపీటలెక్కారు. ఆగే కొంతమంది మాత్రం లవ్ ఎఫైర్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. అలాగే బ్రేకప్స్ కూడా జరిగాయి.

సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 15, 2026 | 8:25 AM

Share

కొంతమంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డామ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అంతే కాదు వరుసగా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎంత ప్రయత్నించిన స్టార్ డమ్స్ మాత్రం అందుకోలేకపోతున్నారు. కొంతమంది అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు. అందం, అభినయం ఉన్నా ఆఫర్స్ మాత్రం పలకరించడం లేదు.. వారిలో ఈ అమ్మడు ఒకరు. తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.. సినిమాల్లోనే కాదు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఓ సంఘటనతో ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. సినిమాలు మానేద్దామని డిసైడయ్యా.. హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్.

ఇది కూడా చదవండి : కుర్రాళ్ల ఆల్ టైం ఫేవరెట్ మూవీ.. పెట్టింది రూ.4కోట్లు వచ్చింది రూ. 110కోట్లు.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిన్న సినిమా

అందాల భామ నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నివేదా. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది నివేదా.. ఆతర్వాత వరుసగా ఆతర్వాత వరుసగా తెలుగులో నటించింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, బ్లడీ మేరీ, విరాట పర్వం ,దాస్‌ కా ధమ్కీ నటించింది. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇంటర్వెల్ సీన్ మార్చేశారు.. కట్ చేస్తే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసింది

ఆ మధ్య సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అనౌన్స్ చేసింది. అంతే కాదు ఆతర్వాత సినిమాలకు గ్యాప్ కూడా ఇచ్చింది. పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తుందని అనుకునేలోగా.. ప్రియుడితో బ్రేకప్ జరిగింది. ఇన్ స్టా గ్రామ్ నుంచి ప్రియుడుతో ఉన్న ఫోటోలను తొలగించి విడిపోతున్నాం అంటూ హింట్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఈ అమ్మడు సింగ్ గీతం సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. నేను 2023లో సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నా.. జీవితంలో నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. సింగీతం శ్రీనివాసరావు గారి బ్లాక్ బస్టర్ తో తిరుగి ఇండస్ట్రీలోకి ల్యాండ్ అయ్యా.. నాకు తిరిగి ప్రాణం పోసిన నాగ్ అశ్విన్ కి థ్యాంక్స్.. నాగ్ అశ్విన్ ఈ సినిమా ఛాన్స్ నాకు ఇవ్వకపోయి ఉంటే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేదాన్ని.. గొప్ప సినిమాతో తిరిగి వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది నివేదా పేతురాజ్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
ఏడేళ్ల చిన్నారి మహాదానం.. అవయవదానం చేసి ఆరుగురికి కొత్త జీవితం
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
మెరుగైన విద్యకు కేరాఫ్. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రూ.33 కోట్లతో కొత్త స్కూళ్లు
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
ఆపదలో భయాన్ని దాచడమే తెలివి.. మేకపోతు గాంభీర్యం కథ
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీ అకౌంట్లోకి ఎంత వస్తుంది..?
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ సూపర్ గుడ్‌న్యూస్
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
ప్రభాస్ మూవీలో ఆ సీన్ చేయను.. నా వల్ల కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
గొప్ప మనసు చాటుకున్న హీరో నిఖిల్.. 1000 మంది స్కూల్ పిల్లలకు..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఈ పొరపాటు చేస్తే ఖాతా ఖాళీ..