AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు డబ్బుకోసం ఆటో నడిపాడు.. కట్ చేస్తే కమెడియన్‌గా నంది అవార్డు

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి పైకి వచ్చారు. ఎంతో మంది కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబందులు, కష్టాలు చూసి ఆతర్వాత సక్సెస్ అయ్యి స్టార్స్ అయ్యారు. వారిలో ఈ స్టార్ కమెడియన్ ఒకరు. తన కామెడీతో ఏకంగా నంది అవర్డు కూడా అందుకున్నారు.

అప్పుడు డబ్బుకోసం ఆటో నడిపాడు.. కట్ చేస్తే కమెడియన్‌గా నంది అవార్డు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 9:29 AM

Share

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో, ముఖ్యంగా తాగుబోతు పాత్రలతో ప్రేక్షకులను అలరించే నటుడు తాగుబోతు రమేష్ తన జీవిత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన తన గతాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను, సినీ రంగ ప్రవేశానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. గోదావరిఖనిలో జన్మించిన రమేష్, సింగరేణి కార్మికుడి కుమారుడు. ఆయన విద్య కేవలం ఏడో తరగతితో ముగిసింది, చిన్నతనంలో తన స్నేహితుడు శంకర్ ఫ్యామిలీ మెకానిక్ పనులు చేసే వారు. తన స్నేహితుడి ప్రభావంతో మెకానిక్ షాపులలో పని చేయడం ప్రారంభించారు. చదువుతో పైసా రాదు కానీ, కష్టపడితే తక్షణమే డబ్బు వస్తుందనే ఆలోచనతో ఆయన చదువును మధ్యలోనే వదిలేశారు. కుటుంబంలో నలుగురు అన్నదమ్ములలో తానొక్కడే  అల్లరివాడు గా ఉండటం, ఈ అల్లరి స్వభావమే భవిష్యత్తులో నటుడిగా మారడానికి దోహదపడిందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

1995లో ఆటో డ్రైవర్‌గా పని చేసిన ఆయన జీవితంలో తల్లి మరణం ఒక పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన ఆయనను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో, గోదావరిఖనిలో పొట్టి తిరుపతి అన్న అనే వ్యక్తి రమేష్ జీవితానికి ఒక సరికొత్త మార్గాన్ని చూపించారు. ఆయన సలహాతో తన మామ, కాశీపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) వద్దకు వెళ్లారు. లింగయ్య ఇంట్లో పనిచేయడానికి వెళ్లిన రమేష్‌కు అనూహ్యంగా సూపర్వైజర్ ఉద్యోగం లభించింది. పెయింటింగ్ పనులు ఇస్తారని భావించిన ఆయనకు, వంద మందికి స్లిప్పులు రాసే సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఉద్యోగం రమేష్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. “సార్ సార్” అని పిలవించుకోవడం, గౌరవం లభించడం ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ సంఘటన ఆయన మైండ్ సెట్‌ను మార్చి, డబ్బు, మనుషుల స్వభావం గురించి అవగాహన కల్పించింది.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

తన సినీ రంగ విజయాల పరంపరలోనూ రమేష్ తన మూలాలను ఎన్నడూ మర్చిపోలేదు. డబ్బు ఉన్నప్పుడు, లేనప్పుడు బంధువులు ఎలా వ్యవహరిస్తారో ప్రాక్టికల్‌గా చూశానని ఆయన గుర్తు చేసుకున్నారు. కారులో తిరుగుతూ, పెద్ద హోటళ్లలో బస చేసినా, తన అక్కకు, అన్నలకు ఫోన్ చేయడమే తన నిజమైన జీవితమని నమ్ముతా అని అన్నారు. తన చెల్లెలి పిల్లలు, అన్నలు, అమాయకుడైన తన తమ్ముడు వంటి కుటుంబ బాధ్యతలు తనను ఎప్పుడూ నేల మీదనే ఉంచుతాయని ఆయన అన్నారు. తనను ఆర్థికంగా ఆదుకున్న స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన అన్నారు. ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన ప్రతిభతో , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అంతే కాదు తన కామెడీతో నంది అవార్డును కూడా గెలుచుకున్నారు తాగుబోతు రమేష్.

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

Thagubothu Ramesh

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us