AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగాళ్లు బీ అలర్ట్.. ఇవి తింటే వీర్యకణాల సంఖ్య పడిపోవడం పక్కా.. ఈ విషయాలు తెలుసుకోండి..

నేటి ఆధునిక యుగంలో మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు పురుషుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో ప్రతి వీధిలోనూ టీ స్టాళ్లలాగా కృత్రిమ గర్భధారణ కేంద్రాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రధాన కారణం చాలా మంది పురుషులలో వీర్యకణాల కొరత ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. పురుషులు వీర్యకణాల సంఖ్యను కాపాడుకోవాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jun 17, 2026 | 9:44 PM

Share
ప్రాసెస్ చేసిన మాంసం: మన దేశంలో ఇప్పుడు చాలా మంది పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లను చురుకుగా అనుసరిస్తున్నారు. అందులో భాగంగా హామ్, సాసేజ్, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాన్ని విరివిగా తింటున్నారు. పురుషులు ఈ రకమైన మాంసాన్ని క్రమం తప్పకుండా తింటూ ఉంటే వారిలో వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో సహజంగా సంతానం పొందడంలో అనేక సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

1 / 5
కార్బోనేటెడ్ పానీయాలు: నేటి యువతలో చాలామంది తమ దాహాన్ని తీర్చుకోవడానికి, తాత్కాలిక ఉత్తేజం కోసం సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి కార్బోనేటెడ్ పానీయాలను అధిక పరిమాణంలో తాగడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఈ పానీయాలలో ఉండే కెమికల్స్, అధిక చక్కెర స్థాయిలు శరీరానికి హాని చేయడమే కాకుండా పురుషుల వీర్యకణాల పనితీరును, వాటి కదలిక సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.

2 / 5
హై-ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్: చాలా మంది పురుషులు తమ రోజువారీ ఆహారంలో చీజ్, బట్టర్, ఇతర అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులను ఎక్కువగా చేర్చుకుంటారు. సాధారణంగా ఈ పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్ డి వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. వీటిని పరిమితికి మించి అధికంగా తీసుకున్నప్పుడు అవి రివర్స్ ఎఫెక్ట్ ఇస్తాయి. ఇవి పురుషుల వీర్యకణాల ఆరోగ్యాన్ని దెబ్బతీసి, వాటి కౌంట్‌ను తగ్గించగలవని వైద్య అధ్యయనాలలో తేలింది.

3 / 5
సోయా ఉత్పత్తులు: బోస్టన్‌లో నిర్వహించిన ఒక ప్రధాన శాస్త్రీయ వైద్య అధ్యయనంలో ఒక షాకింగ్ నిజం వెల్లడైంది. పురుషులు తమ ఆహారంలో సోయాబీన్స్, సోయా మిల్క్, చంక్స్ వంటి సోయా ఉత్పత్తులను నిరంతరం అధిక మొత్తంలో తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ అధ్యయన ఫలితాల ప్రకారం.. సోయా ఉత్పత్తులను అమితంగా తీసుకునే సుమారు 99 శాతం మంది పురుషులలో వీర్య కణాల సంఖ్య మరియు వాటి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

4 / 5
కృత్రిమ గర్భధారణ కేంద్రాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదంటే.. పురుషులు ఇప్పటికైనా ఈ పాశ్చాత్య ఆహార సంస్కృతికి, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో తాజా పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాలు ఉన్న దేశీ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వీర్యకణాల సంఖ్యను సహజంగానే పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ డైట్‌లో ఏదైన మార్పులు చేయాలనుకుంటే మీ పర్సనల్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం)

5 / 5
Follow Us