రిమోట్ లేకుండా ఏసీని ఎలా ఆన్ చేయాలి?

Venkatrao Lella

Images: Pinterest

09 UNE 2026

బ్యాటరీ అయిపోయినప్పుడు లేదా రిమోట్ పోగొట్టుకున్నప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి స్ప్లిట్ ఏసీలోనూ దాన్ని సులభంగా ఆన్ చేయడానికి వీలు కల్పించే ఒక చిన్న, కనిపించని బటన్ ఉంటుంది.

ఏసీ రిమోట్

ఏసీలను రిమోట్‌తో మాత్రమే ఆపరేట్ చేయగలమని ప్రజలు భావిస్తారు. అయితే ప్రతి స్ప్లిట్ ఏసీలో చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది.

ప్రత్యేక ఫీచర్

స్ప్లిట్ ఏసీ ఇండోర్ యూనిట్ లోపల ఒక చిన్న బటన్ ఉంటుంది. దీనిని ఎమర్జెన్సీ బటన్ అని కూడా అంటారు. రిమోట్ పనిచేయనప్పుడు ఏసీని ఆన్ చేయడానికి ఈ బటన్‌ను ఉపయోగించవచ్చు.

బటన్ ఎక్కడ..?

ఏసీ ఇండోర్ యూనిట్ ముందు కవర్‌ను మెల్లగా తెరవండి. కవర్ తెరిచిన తర్వాత లోపల, సాధారణంగా పక్కన ఉండే ఒక చిన్న బటన్ మీకు కనిపిస్తుంది. ఇదే ఎమర్జెన్సీ రన్ బటన్.

అత్యవసర బటన్

ఈ బటన్‌ను ఒకసారి నొక్కితే ఏసీ ఆన్ అవుతుంది. దాన్ని మళ్ళీ నొక్కితే ఆఫ్ కూడా చేయవచ్చు. అయితే ఈ పద్ధతి ద్వారా మీరు ఉష్ణోగ్రత లేదా మోడ్ వంటి సెట్టింగ్‌లను మార్చలేరు.

ఏం చేయాలి..?

ఈ ఫీచర్ కేవలం అత్యవసర పరిస్థితుల కోసం మాత్రమే యూజ్ చేయాలి. దీనిని తరచుగా ఉపయోగించడం మానుకోవాలి. వీలైనంత త్వరగా కొత్త రిమోట్‌ను కొనుగోలు చేయడం లేదా మీ పాత రిమోట్‌ను మరమ్మత్తు చేయించుకోవడం ఉత్తమం.

అప్రమత్తంగా ఉండండి

ఏసీలో ఈ ఫీచర్ ఉంటుందని చాలామందికి తెలియదు. దీంతో దీనిని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోలేకపోతున్నారు. దీని గురించి అవగాహన కలిగి ఉండటం ఉత్తమం.

చాలామందికి తెలియదు

సమ్మర్ కారణంగా ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. దీంతో ఇళ్లల్లో ఏసీల వినియోగం భారీగా పెరిగింది. నైరుతి రుతుపవనాల రాకతో త్వరలో ఉష్ణో్గ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోంది.

సమ్మర్ ఎఫెక్ట్ తెలియదు

వేసవికాలంలో అధికంగా ఏసీలు వాడటం వల్ల వేడెక్కి కాలిపోతున్న సంఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో మంటలు చెలరేగి అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఏసీలు వాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

కాలిపోతున్న ఏసీలు తెలియదు