June 06, 2026
Subhash
ఇంధనాన్ని ఆదా చేయడానికి చాలా మంది ఏసీ బంద్ చేసి, కిటికీలు తెరిచి ప్రయాణిస్తారు. కానీ దీని వల్ల మైలేజీ పెరుగుతుందా లేదా తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారా?
కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల ఇంజన్‌పై భారం పడి మైలేజీ తగ్గుతుందని, అందుకే కిటికీలు తెరిచి నడపడం మంచిదని చాలా మంది భావిస్తారు.
ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని పరిస్థితులలో కారు కిటికీలు పూర్తిగా తెరిచి డ్రైవ్ చేయడం వల్ల మైలేజీ పెరగకపోగా, మరింత తగ్గే అవకాశం ఉంది.
కార్ల తయారీలో గాలిని చీల్చుకుంటూ సులభంగా ముందుకు వెళ్లేలా (ఏరోడైనమిక్ డిజైన్) రూపుదిద్దుతారు. కానీ కిటికీలు తెరిచినప్పుడు బయటి గాలి నేరుగా కారు క్యాబిన్‌లోకి ప్రవేశిస్తుంది.
కిటికీల ద్వారా లోపలికి వచ్చే గాలి కారును వెనక్కి నెడుతుంది. ఇది ఒక పారాచూట్‌లా పనిచేసి కారు ముందుకు సాగకుండా ప్రతిఘటన సృష్టిస్తుంది.
గాలి ఒత్తిడి కారణంగా కారును ముందుకు తీసుకెళ్లడానికి ఇంజన్ సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఇంజన్‌పై ఒత్తిడి పెరగడం వల్ల ఇంధన వినియోగం ఎక్కువై మైలేజీ పడిపోతుంది.
గంటకు 50-60 కిమీ కంటే ఎక్కువ వేగంతో (హైవేలపై) వెళ్తున్నప్పుడు కిటికీలు మూసివేసి ఏసీ ఆన్ చేయడం వల్లనే మంచి మైలేజీ వస్తుంది. తక్కువ వేగంతో సిటీలో వెళ్తే కిటికీలు తెరిచినా నష్టం ఉండదు.
అందుకే హైవేలపై ప్రయాణించేటప్పుడు కిటికీలు మూసి ఉంచి ఏసీని సాధారణ మోడ్‌లో రన్ చేయడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. ప్రయాణాన్ని హాయిగా మార్చుకోవచ్చు.