Klin Kaara: రామ్‌ చరణ్‌- ఉపాసనల కూతురికి ‘క్లిన్‌ కారా’ పేరు సూచించింది ఎవరో తెలుసా?

గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. కొద్ది రోజుల క్రితం రామ్, ఉపాసన దంపతులకు ఓ అందమైన పాప పుట్టింది. నిన్న(జూన్ 30) ఈ పాపకు బారసాల వేడుక, నామకరణం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

Klin Kaara: రామ్‌ చరణ్‌- ఉపాసనల కూతురికి 'క్లిన్‌ కారా' పేరు సూచించింది ఎవరో తెలుసా?
Ram Charan, Upasana
Follow us

|

Updated on: Jul 01, 2023 | 9:18 PM

గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. కొద్ది రోజుల క్రితం రామ్, ఉపాసన దంపతులకు ఓ అందమైన పాప పుట్టింది. నిన్న(జూన్ 30) ఈ పాపకు బారసాల వేడుక, నామకరణం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పాపకు క్లిన్ కారా అని పేరు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఈ పేరు నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు చాలామంది నెట్టింటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వినడానికి క్లిక్‌ కారా అనే పేరు ఫారిన్‌ పేరు లాగా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ పేరు వెనక ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు ఉందంటున్నారు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు. గిరిజనుల ఆరాధ్యదైవమైన చెంచుదేవి, బోరమ్మ దేవి ఆశీస్సులతో తమ పాపకు క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టినట్లు రామ్ చరణ్ తెలిపారు. ఈ పేరు లలితా సహస్రనామం నుండి తీసుకున్నామని, ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే పరివర్తన, శుద్ధి చేసే శక్తిని సూచిస్తుందని ఉపాసన తెలిపింది. క్లిన్‌ కారీ అనే పేరు లలితా సహస్రనామంలోని 125వ పాదంలోనుంచి తీసుకున్నామని, దాని నుండి ఆమె తన కుమార్తెకు క్లీన్ కారా అని పేరు పెట్టినట్లు మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. ఇంతకీ రామ్‌ చరణ్‌- ఉపాసనల కూతురికి క్లిన్‌ కారా అని పేరు పెట్టింది ఎవరో తెలుసా?

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్, ఉపాసనల కుమార్తెకు క్లిన్‌ కారా అని పెట్టింది మరెవరో కాదు .. ఉపాసన తల్లి శోభనా కామినేని. తాజాగా ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారామె. ‘ఉపాసనా నువ్వు పుట్టినప్పుడు నీకు క్లిన్ కారా అని పేరు పెట్టాలనుకున్నాను, కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్- ఉపాసనలకు అభినందనలు, మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. మేము నిన్ను ప్రేమిస్తున్నాము కారా’ అని తన మనవరాలి బారసాల వేడుకలకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది శోభనా కామినేని. ఈ పోస్టుకు స్పందించిన ఉపాసన ‘ధన్యవాదాలు అమ్మ’ అని రిప్లై ఇచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.