Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ సతీమణికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? కాలేజీకి డుమ్మా కొట్టి మరీ ఆయన సినిమాలకు..

సినిమాల సంగతి పక్కన పెడితే కల్యాణ్‌ రామ్‌ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం రండి. కల్యాణ్‌ రామ్‌ భార్య పేరు స్వాతి. తను వృత్తిరీత్యా ఓ డాక్టర్‌. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లిచూపుల్లోనే స్వాతిని చూసిన కల్యాణ్‌ రామ్ ఆమెనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టారట.

Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ సతీమణికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? కాలేజీకి డుమ్మా కొట్టి మరీ ఆయన సినిమాలకు..
Kalyan Ram Family
Follow us
Basha Shek

|

Updated on: Jun 28, 2023 | 1:03 PM

‘నందమూరి’ ట్యాగ్‌తోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కల్యాణ్‌ రామ్‌. అయితే ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతనొక్కడే, హరేరామ్‌, కత్తి, ఓం 3డీ, 118, బింబిసారా వంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాడు కల్యాణ్‌ రామ్‌. ఇక చివరిగా నటించిన అమిగోస్‌ లో ఏకంగా మూడు పాత్రలతో మెప్పించాడు. కాగా సినిమాల సంగతి పక్కన పెడితే కల్యాణ్‌ రామ్‌ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం రండి. కల్యాణ్‌ రామ్‌ భార్య పేరు స్వాతి. తను వృత్తిరీత్యా ఓ డాక్టర్‌. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లిచూపుల్లోనే స్వాతిని చూసిన కల్యాణ్‌ రామ్ ఆమెనే వివాహం చేసుకుంటానని పట్టుబట్టారట. అలా 2006 ఆగస్టు 10న కల్యాణ్‌ రామ్, స్వాతిల వివాహం జరిగింది. ఈ దంపతులకు అదైత, శౌర్య‌రామ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇక స్వాతి కూడా వ్యాపార రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు సొంతంగా వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీ ఉంది. కల్యాణ్‌ రామ్‌ నటించిన బింబిసార సానిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఎక్కువగా ఈ సంస్థలోనే జరిగాయి. ఇక ఆమె గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే? టాలీవుడ్‌ హీరోల్లో కల్యాణ్‌ రామ్‌ కంటే ఆమెకు నాగార్జున అంటే ఎక్కువ ఇష్టమట. ముఖ్యంగా నాగార్జున నటించిన బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘మన్మథుడు’ మూవీని లెక్కలేనన్ని సార్లు చూశారట. ఇక కాలేజీ రోజుల్లో నాగ్ సినిమా విడుదలయితే చాలు.. క్లాసులకు డుమ్మా కొట్టి మరీ మూవీస్‌కు వెళ్లేవారట.

ఇవి కూడా చదవండి
Kalyan Ram Family 1

Kalyan Ram Family

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.