AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీకున్న క్రేజ్‌ నెక్ట్స్‌లెవెల్‌ అంతే..

బుల్లితెర మహారాణిగా పేరొందిన ఆమె స్టేజ్‌మీద ఆమె ఉందంటే మాటల ప్రవాహమే. పంచులు, ప్రాసలకు ఏ మాత్రం కొదవ ఉండదు. మన రాష్ట్రంలో పుట్టకపోయినా తెలుగు గల గలా మాట్లాడడం ఈమెకు మాత్రమే సొంతం. ఒక్క తెలుగే కాదు హిందీ, తమిళ్‌, ఇంగ్లిష్‌ ఏ భాషలోనైనా చక్కగా మాట్లాడుతుంది.

Tollywood: ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీకున్న క్రేజ్‌ నెక్ట్స్‌లెవెల్‌ అంతే..
Tollywood Celebrity
Basha Shek
|

Updated on: Jun 27, 2023 | 10:52 AM

Share

పై ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో ది మోస్ట్‌ క్రేజీయెస్ట్ సెలబ్రిటీ. అలాగనీ హీరోయిన్‌ మాత్రం కాదు. బుల్లితెర మహారాణిగా పేరొందిన ఆమె స్టేజ్‌మీద ఆమె ఉందంటే మాటల ప్రవాహమే. పంచులు, ప్రాసలకు ఏ మాత్రం కొదవ ఉండదు. మన రాష్ట్రంలో పుట్టకపోయినా తెలుగు గల గలా మాట్లాడడం ఈమెకు మాత్రమే సొంతం. ఒక్క తెలుగే కాదు హిందీ, తమిళ్‌, ఇంగ్లిష్‌ ఏ భాషలోనైనా చక్కగా మాట్లాడుతుంది. అందుకే మన సినిమా ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా ఆమె పక్కాగా ఉండాల్సిందే. ఏ ప్రోగ్రామ్ జరిగినా స్టేజిపై తను కనపడాల్సిందే. లేకుంటే అది రక్తికట్టదన్న భావన టాలీవుడ్‌లో ఉంది. ఇలా సుమారు 2 దశాబ్దాలకు పైగా టాలీవుడ్‌లో హవా సాగిస్తోన్న ఆమె ఎవరో ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది. యస్‌. మీ గెస్‌ కరెక్టే.. తను మరెవరో కాదు మన స్టార్ యాంకర్‌ సుమ కనకాల. ఇది తన చిన్నప్పటి ఫొటో. కేరళ కుట్టి గెటప్‌లో చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉంది కదా సుమ. ఇప్పుటికీ అంతే అందంగా ఉంటుందిలెండీ.

కేరళకు చెందిన ఈ అందాల తార మొదట కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే తనకు బుల్లితెరే కరెక్ట్‌ అనిపించిందేమో. స్టార్‌ యాంకర్‌గా స్మాల్‌ స్క్రీన్‌పై తన హవాను కొనసాగిస్తోంది. తిరుగులేని యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొంటోంది. నాటి స్టార్‌ మహిళ నుంచి నేటి సుమ అడ్డా వరకు ఆమె ఏ షో చేసినా సూపర్‌ హిట్టే. అందుకే ఆమెకు బుల్లితెరపై బోలెడు డిమాండ్‌ ఉంది. ఇక రెమ్యునరేషన్‌ సంగతంటారా? ఒక్కరోజు కోసం రూ.2.5 లక్షల నంఉచి 3 లక్షల వరకు ఛార్జ్‌ చేస్తుందామె. ఇటీవలే జయమ్మ పంచాయతీతో మరోసారి వెండితెరపై అదృష్టం పరీక్షించుకుంది. అయితే సినిమా పెద్దగా ఆడలేదు. అయితే సుమక్క క్రేజ్‌ మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా