AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas- Suma: ఏంటి.. స్టార్‌ యాంకర్‌ సుమ ప్రభాస్‌ అక్కగా నటించిందా? ఏ సినిమాలోనో తెలుసా?

కెరీర్‌ ప్రారంభంలో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది సుమ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫేమస్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ వక్కంతం వంశీ హీరోగా నటించాడు.

Prabhas- Suma: ఏంటి.. స్టార్‌ యాంకర్‌ సుమ ప్రభాస్‌ అక్కగా నటించిందా? ఏ సినిమాలోనో తెలుసా?
Prabhas, Suma Kanakala
Basha Shek
|

Updated on: Jun 26, 2023 | 1:24 PM

Share

తన మాటల ప్రవాహంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడంలో స్టార్ యాంకర్‌ సుమకు సాటెవరు రారు. పుట్టిందో కేరళలో అయినా తెలుగులో గలాగలా మాట్లాడే సుమకు అశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అందుకే టీవీ షో , సినిమ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ లేక మరే ఈవెంటైనా సుమ ఉంటేనే సక్సెస్‌ అవుతుంన్న టాక్‌ ఉంది. ఇక ఇటీవల తిరుపతిలో జరిగిన ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సుమ హాజరుకాకపోవడంతో అభిమానులు, నెటిజన్లందరూ గగ్గోలు పెట్టారు. అయితే ఆ సమయంలో సుమ ఫారిన్‌ టూర్లో ఉండడంతో ఆదిపురుష్‌ ఈవెంట్‌ను మిస్‌ అయ్యానని ఆమే చెప్పుకొచ్చింది. కాగా కెరీర్‌ ప్రారంభంలో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది సుమ. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫేమస్‌ రైటర్‌ అండ్‌ డైరెక్టర్‌ వక్కంతం వంశీ హీరోగా నటించాడు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసినా బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. అయితే మధ్యలో కొన్ని సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌లో సందడి చేసింది. అందులో ప్రభాస్‌ సూపర్‌ హిట్‌ సినిమా వర్షం కూడా ఉంది. అందులో ప్రభాస్‌ అక్కగా సుమ నటించింది. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు.

తాజాగా ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు సుమ. త్రిష కీలక పాత్రలో నటించిన పొన్నియన్‌ సెల్వన్‌ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్‌గా వ్యవహరించింది సుమ. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ ‘వర్షం’ సినిమా నాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ‘సుమ గారు.. మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు వర్షం సినిమా అప్పటి నుంచి సుమ తెలుసు. అందులో మనమిద్దరం కలిసి నటించాం’ అని వ్యాఖ్యానించగా వెంటనే మైక్‌ అందుకున్నత్రిష.. ‘ వర్షంలో నేను ప్రభాస్‌ సోదరిగా నటించాను. మీ సిస్టర్‌గా చేయాల్సి ఉంది’ అని రిప్లై ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!