AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్‌ హయతీ ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?

గతంలో రష్మిక మందన్నా, నిధి అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరో హీరోయిన్లు వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో ప్రముఖ హీరోయిన్‌ చేరింది. ఆమె మరెవరో కాదు ఇటీవల ఓ పోలీస్‌ ఉన్నతాధికారితో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచిన డింపుల్‌ హయతీ.

Dimple Hayathi: వేణుస్వామితో డింపుల్‌ హయతీ ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?
Dimple Hayathi, Venu Swami
Basha Shek
|

Updated on: Jun 25, 2023 | 8:44 PM

Share

సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి. ఇటీవల రామ్‌చరణ్‌- ఉపాసనల కూతురు భవిష్యత్‌ గురించి చెప్పి అందరి నోళ్లలో నానారు. ఇక సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పింది చాలాసార్లు నిజం కావడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతుంటారు. అదే సమయంలో వేణుస్వామి జాతకాలు, వ్యాఖ్యలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే గతంలో రష్మిక మందన్నా, నిధి అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరో హీరోయిన్లు వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో ప్రముఖ హీరోయిన్‌ చేరింది. ఆమె మరెవరో కాదు ఇటీవల ఓ పోలీస్‌ ఉన్నతాధికారితో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచిన డింపుల్‌ హయతీ. ఇప్పుడీ వివాదం నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె వేణుస్వామిని ఆశ్రయించినట్లు సమాచారం. డింపుల్‌ ఇంట్లోనే వేదమంత్రాల నడుమ వేణుస్వామి ప్రత్యేక పూజలు, యాగాలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

కాగా చివరిగా గోపిచంద్‌ నటించిన రామబాణం సినిమాలో కనిపించింది డింపుల్‌ హయతీ. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే తన అపార్ట్‌మెంట్‌లోనే నివాసముంటోన్న ఓ పోలీస్‌ అధికారితో డింపుల్‌ గొడవ పడింది. కారు పార్కింగ్ కోసమే ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ విషయమై సదరు పోలీస్‌ అధికారి డింపుల్‌ హయతీపై కేసు కూడా పెట్టాడు. ఇప్పుడీ వివాదం సమసిపోవాలనే తలంపుతోనే వేణుస్వామితో డింపుల్‌ పూజలు చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. కమల్ హాసన్‌ నటిస్తోన్న ‘ఇండియన్‌ 2’ సినిమాలో డింపుల్ స్పెషల్‌ సాంగ్‌ చేయనుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి