Kabir Singh: ఓ ఇంటి వాడైన టాలీవుడ్ స్టైలిష్‌ విలన్‌.. మ్యాథ్స్‌ టీచర్‌ మెడలో మూడు ముళ్లు వేసిన కబీర్‌ సింగ్‌

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ స్టైలిష్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కబీర్‌ సింగ్‌ ఓ ఇంటి వాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Kabir Singh: ఓ ఇంటి వాడైన టాలీవుడ్ స్టైలిష్‌ విలన్‌.. మ్యాథ్స్‌ టీచర్‌ మెడలో మూడు ముళ్లు వేసిన కబీర్‌ సింగ్‌
Kabir Duhan Singh Marriage
Follow us
Basha Shek

|

Updated on: Jun 24, 2023 | 6:46 PM

టాలీవుడ్‌లో ది మోస్ట్‌ స్టైలిష్‌ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కబీర్‌ సింగ్‌ ఓ ఇంటి వాడయ్యాడు. హర్యానాకు చెందిన సీమ చాహల్‌ అనే అమ్మాయితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఫరీదాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు వధూవరుల సన్నిహితులు, స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. కబీర్‌- సీమ చాహల్‌ల పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన కబీర్‌ సింగ్‌.. గోపీచంద్‌ ‘జిల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాలోనే స్టైలిష్‌ విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత కిక్‌ 2, డిక్టేటర్‌, వేదాళం (తమిళ్‌), స్పీడున్నోడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌, సుప్రీమ్‌, జక్కన్న, సాక్ష్యం, శాకినీ డాకినీ, హంట్‌, కబ్జా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఇటీవల సమంత నటించిన శాకుంతలంలోనూ అసుర రాజుగా ఆకట్టుకున్నాడు.

మొదటి సారి చూడాగానే..

ఇక కబీర్‌ భార్య సీమా చాహల్‌ విషయానికొస్తే.. మ్యాథ్స్‌ టీచర్‌ అని తెలుస్తోంది. కాగా సీమాతో పెళ్లి అనంతరం మాట్లాడిన కబీర్‌ సింగ్‌ ‘ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినందుకు సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు, అభిమానులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. నా సతీమణి సీమకు కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె జీవితంలో నేను బెస్ట్‌ హీరోగా ఉండాలనుకుంటున్నాను. నేను సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడదే నిజమైంది. సీమాను కలిసిన మొదటి క్షణంలోనే ఆమే నా అర్ధాంగి అనిపించింది. నన్ను, నా ఫ్యామిలీని బాగా అర్థం చేసుకోగలదన్న నమ్మకం కలిగింది. ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది’ అని ఉబ్బితబ్బిబ్బైపోయాడు కబీర్‌ సింగ్‌.

ఇవి కూడా చదవండి
Kabir Duhan Singh Marriage

Kabir Duhan Singh Marriage