AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ కార్మికుల కోసం చిరంజీవి గొప్ప నిర్ణయం.. రోజుకు 1000 మందికి ఉచిత క్యాన్సర్‌ టెస్టులు.. ఎప్పటినుంచంటే?

సినీ కార్మికులు, మెగా అభిమానులకు చిరంజీవి శుభవార్త చెప్పారు. వీరికి చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని మెగాస్టార్‌ వెల్లడించారు. జులై 9 నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, రోజుకు 1000 మందికి ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని చిరంజీవి పేర్కొన్నారు.

సినీ కార్మికుల కోసం చిరంజీవి గొప్ప నిర్ణయం.. రోజుకు 1000 మందికి ఉచిత క్యాన్సర్‌ టెస్టులు.. ఎప్పటినుంచంటే?
Megastar Chiranjeevi
Basha Shek
|

Updated on: Jun 23, 2023 | 7:57 PM

Share

సినీ కార్మికులు, మెగా అభిమానులకు చిరంజీవి శుభవార్త చెప్పారు. వీరికి చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, స్టార్‌ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని మెగాస్టార్‌ వెల్లడించారు. జులై 9 నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, రోజుకు 1000 మందికి ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో స్టార్‌ ఆస్పత్రి ప్రతినిధులు, చిరంజీవి కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్‌.. సినీ కార్మికులతో పాటు మెగా ఫ్యాన్స్‌ కు చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో ఉచిత క్యాన్సర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ‘రోజుకు 1000 మందికి చొప్పున అన్ని రకాల కాన్సర్ టెస్టులు చేస్తారు. మరో 2,3 రోజుల్లో సినీ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమై ఈ విషయంపై చర్చిస్తాం. క్యాన్సర్ స్క్రినింగ్ కోసం సినీ కార్మికులకు ప్రత్యేక కార్డులు జారీ చేస్తాం. జులై 9న హైదరాబాద్, 16న విశాఖపట్నం, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహిస్తాం’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కాగా కొద్ది రోజుల క్రితమే ఉచిత క్యాన్సర్ పరీక్షలపై ప్రకటన చేశారు చిరంజీవి. అదే సమయంలో తాను క్యాన్సర్‌ బారిన పడకుండా ముందుగానే కొలనోస్కోపీ ట్రీట్‌మెంట్ చేయించుకున్నట్లు తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం భోళాశంకర్‌ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి. తమన్నా హీరోయిన్‌గా, కీర్తి సురేశ్‌ చిరంజీవి చెల్లెలిగా కనిపించనున్నారు. ఆగస్టులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి