- Telugu News Photo Gallery Cinema photos Famous Astrologer Venu Swamy reveals Ram Charan baby girl future horoscope
Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల కూతురి జాతకం చెప్పిన వేణుస్వామి.. మెగా ప్రిన్సెస్ ఫ్యూచర్ ఎలా ఉండనుందంటే?
సెలబ్రిటీల జాతకాలను చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి రామ్ చరణ్ కూతురి జాతకంపై స్పందించారు. మెగా ప్రిన్సెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వివరించారు.
Updated on: Jun 21, 2023 | 1:51 PM

రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. మంగళవారం తెల్లవారు జామున ఉపాసన పండంటి ఆడబిడ్డను ప్రసవించింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈక్రమంలో సెలబ్రిటీల జాతకాలను చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి రామ్ చరణ్ కూతురి జాతకంపై స్పందించారు. మెగా ప్రిన్సెస్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వివరించారు.

ఎప్పుడూ ఏదో నెగెటివ్‌గా మాట్లాడే వేణుస్వామి రామ్ చరణ్ కూతురి జాతకం విషయంలో మాత్రం చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. పాప పుట్టిన సమయం అద్భుతంగా ఉందని, తన జాతకంలో రాజయోగం ఉందన్నారు.

ఉపాసన కూతురు భవిష్యత్‌లో కొణిదెల వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తుందన్నారు వేణుస్వామి. అలాగే తాతను, తండ్రిని మించి అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు

ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రామ్ చరన్ కూతురి రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తోంది. మెగా ప్రిన్సెస్‌కు వెల్‌కమ్ అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు.





























