Telangana: మా కాపురంలో చిచ్చు పెడుతున్నారు.. ఎమ్మెల్యే రాజయ్యపై మళ్లీ సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య - జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గతంలో లైంగిక ఆరోపణలు.. ఆ తర్వాత కాంప్రమైజ్‌లు వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ఇప్పుడవి మళ్లీ భగ్గుమన్నాయి

Telangana: మా కాపురంలో చిచ్చు పెడుతున్నారు.. ఎమ్మెల్యే రాజయ్యపై మళ్లీ సంచలన ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య
Mla Rajaiah
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2023 | 10:17 AM

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య – జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. గతంలో లైంగిక ఆరోపణలు.. ఆ తర్వాత కాంప్రమైజ్‌లు వెంట వెంటనే జరిగిపోయాయి. కానీ ఇప్పుడవి మళ్లీ భగ్గుమన్నాయి. ఏకంగా కాపురంలో చిచ్చు దాకా వెళ్లాయి. గతంలో లైంగిక ఆరోపణలకు సంబంధించి ఆధారాలివ్వాలని ఎమ్మెల్యే రాజయ్య ఒత్తిడి చేయడంతో మ్యాటర్‌ చిరిగి చాటైంది. కొద్ది రోజుల క్రితం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళా సర్పంచ్‌ నవ్య లైంగిక ఆరోపణలు పెద్ద దుమారాన్నే లేపాయి. నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశాలతో.. నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య సర్ధిచెప్పారు. జరిగిన పరిణామాలకు చింతిస్తున్నానని విచారణ వ్యక్తం చేశారు.

లైంగిక ఆరోపణల ఎపిసోడ్‌కి ఎండ్‌కార్డ్‌ పడిందనేలోగా మళ్లీ నవ్య తెరపైకి వచ్చారు. ఆడియోలు టేపులు కావాలి.. అందుకోసం 20లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే బేరాలు ఆడుతున్నారని బాంబు పేల్చారు. గ్రామానికి నిధుల పేరుతో డబ్బులిస్తూనే అప్పుకింద బాండ్ పేపర్‌పై సంతకం చేయాలంటున్నారని.. ఈ లాజిక్‌ ఏంటో తనకు అర్థం కావడం లేదన్నారు నవ్య. ఎమ్మెల్యే ఒత్తిడితో తన భర్త కాంప్రమైజ్ కావాలంటున్నారని.. కానీ ఈ విషయంలో ఎక్కడికైనా ఎందాకైనా వెళ్తానన్నారు. అయిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ ఎందుకు తట్టిలేపారు? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు రాజయ్యపై నవ్య ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది మరో ప్రశ్నగా కనిపిస్తోంది. నవ్య మాత్రం అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూనే తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ విషయంలో రాజయ్య ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్