ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు.. పాడే మోసిన శేఖర్‌, జానీ మాస్టర్లు

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. సోమవారం (జూన్‌ 19) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బోరబండ శ్మశానవాటికలో రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు జరిగాయి.

ఇక సెలవు.. అశ్రునయనాల మధ్య ముగిసిన రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు..  పాడే మోసిన శేఖర్‌, జానీ మాస్టర్లు
Rakesh Master Funeral
Follow us
Basha Shek

|

Updated on: Jun 19, 2023 | 9:12 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు ముగిశాయి. సినీ ప్రముఖులు, అభిమానులు అశ్రునయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. సోమవారం (జూన్‌ 19) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బోరబండ శ్మశానవాటికలో రాకేష్‌ మాస్టర్‌ అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు చరణ్‌ తండ్రి చివరి కర్మలను పూర్తి చేస్తారు. అంతకు ముందు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్లు శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్లు తమ గురువు పాడెను మోశారు. ఈ సందర్భంగా రాకేష్‌ మాస్టర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాకేష్‌ మాస్టర్‌ ఆత్మకు శాంతి కలగాలని అభిమానులు, నెటిజన్లు ప్రార్థిస్తున్నారు. కాగా రాకేష్‌ మాస్టర్‌ హఠాన్మరణం తనను షాక్‌కు గురిచేసిందిన జానీ మాస్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ‘నా కెరీర్‌ ఆరంభంలో రాకేష్‌ మాస్టర్‌ చేసిన మద్దతుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశాడు జానీ మాస్టర్‌.

బోరున విలపించిన కూతురు..

కాగా రాకేష్‌ మాస్టర్‌ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముఖ్యంగా కుమారుడు చరణ్‌, కూతురు తమ తండ్రి పార్ధీవ దేహం పక్కనే నిల్చోని బోరున విలపించారు. ఇక అంత్యక్రియల సమయంలో అయితే కుమారుడు చరణ్‌ ఏడుస్తుంటే.. కూతురు కూడా తమ నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఎమోషనలైంది. వీరి బాధతో అక్కడ ఒకరకమైన ఉద్వేగ వాతావరణం నెలకొంది. చాలామంది వీరిని ఓదార్చడానికి ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..