ఫాదర్స్‌ డే స్పెషల్‌.. తండ్రితో పోజులిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరో..

తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరో. తెలుగు హీరోనే అయినా అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగు ఇండస్ట్రీకి పాన్‌ ఇండియా పదాన్ని పరిచయం చేసిందే అతనే. ఇక క్రేజ్‌లో అయితే నెక్ట్స్‌ లెవెల్.

ఫాదర్స్‌ డే స్పెషల్‌.. తండ్రితో పోజులిస్తోన్న ఈ పిల్లాడిని గుర్తుపట్టారా? ఇప్పుడు మోస్ట్‌ ట్రెండింగ్‌ హీరో..
Tollywood Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2023 | 9:44 AM

ఇవాళ (జూన్‌ 18) ఫాదర్స్‌ డే. ఎప్పటిలాగే చాలామంది తమ తండ్రులతో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. తమకు నడకనేర్పిన నాన్నకు ‘ఫాదర్స్‌ డే’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు. తండ్రితో తమకున్న మధురానుభూతులను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటూ మురిసిపోతున్నారు. ఈక్రమంలో ‘ఫాదర్స్‌ డే’ ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అలాగే సినిమా తారల చిన్ననాటి ఫొటోలు, వారి తండ్రులతో దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. ఇందులో తండ్రితో కలిసి చిరునవ్వులు చిందిస్తోన్న పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరో. తెలుగు హీరోనే అయినా అతనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. తెలుగు ఇండస్ట్రీకి పాన్‌ ఇండియా పదాన్ని పరిచయం చేసిందే అతనే. ఇక క్రేజ్‌లో అయితే నెక్ట్స్‌ లెవెల్. మాస్‌, క్లాస్‌ అన్నా తేడా లేకుండా అందరూ ఈ హీరోను అభిమానిస్తారు. ఇక ఇప్పుడు ఈ స్టార్‌ హీరో పేరు ట్రెండింగ్‌లో ఉంది. అతను నటించిన ఓ పాన్‌ ఇండియా సినిమా ఇటీవల విడుదలై రికార్డులు కొల్లగొడుతోంది. ఈపాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? యస్‌. ఈ పిల్లాడు మరెవరో కాదు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ఫాదర్స్‌ డే స్పెషల్‌ సందర్భంగా అతను చిన్నప్పటి, ముఖ్యంగా తండ్రితో కలిసి దిగిన ఫొటోస్‌ తెగ వైరలవుతున్నాయి

ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ శుక్రవారం (జూన్‌ 18)న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైంది. రామాయణం మహాకావ్యం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కృతి సనన్‌ జానకిగా నటించింది. సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా కనిపించారు. ప్రస్తుతం ఆదిపురుష్‌ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది. మొదటి రోజే ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రభాస్‌ గత సినిమాలు బాహుబలి 2, సాహో చిత్రాలు కూడా మొదటి రోజే వంద కోట్ల మార్కును చేరుకున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ అరుదైన రికార్డు అందుకున్న ఏకైక హీరో ప్రభాసే కావడం విశేషం.దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?