Sudhakar: ఈ నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. బుల్లితెరపై స్టార్‌ కమెడియన్ సుధాకర్‌.. ఎలా మారిపోయారో చూశారా?

తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీతో గిలిగింతలు పెట్టిన నటుల్లో సుధాకర్‌ కూడా ఒకరు. తెలుగులో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన 90 వ దశకంలో స్టార్‌ కమెడియన్‌గా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, జగపతిబాబు తదితర హీరోలతో కలిసి పనిచేశారాయన.

Sudhakar: ఈ నవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి.. బుల్లితెరపై స్టార్‌ కమెడియన్ సుధాకర్‌.. ఎలా మారిపోయారో చూశారా?
Comedian Sudhakar
Follow us
Basha Shek

|

Updated on: Jun 17, 2023 | 6:03 PM

తెలుగు ఇండస్ట్రీలో బోలెడు మంది కమెడియన్లు ఉన్నారు. వీరంతా తమదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలా తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీతో గిలిగింతలు పెట్టిన నటుల్లో సుధాకర్‌ కూడా ఒకరు. తెలుగులో వందలాది చిత్రాల్లో నటించిన ఆయన 90 వ దశకంలో స్టార్‌ కమెడియన్‌గా వెలుగొందారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున, జగపతిబాబు తదితర హీరోలతో కలిసి పనిచేశారాయన. కేవలం తెలుగులోనే కాదు హిందీ, కన్నడ, తమిళ్‌, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందారు సుధాకర్‌. నిర్మాతగానూ తన అభిరుచిగానూ చాటుకున్నారు. ఇలా నటుడిగా సుమారు 45 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి సేవలందించారాయాన. అయితే ప్రస్తుతం అనారోగ్య కారణాలతో పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల సుధాకర్‌ చనిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఆయనే స్వయంగా వీడియో విడుదల చేశారు. ‘నేను బతికున్నాను మొర్రో. నా నవ్వు ఆగదు’ అని చెప్పడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

కాగా గత కొద్దికాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తాజాగా బుల్లితెరపై సందడి చేశారు. ఫాదర్స్‌ డే సందర్భంగా ఓ ఛానెల్‌ నిర్వహించిన స్పెషల్‌ ఈవెంట్‌లో సందడి చేశారాయన. 64 ఏళ్ల వయసున్న సుధాకర్‌ యాంకర్ల సహాయంతో స్టేజ్‌ మీదకు వచ్చారు. ఓపిక లేకపోయినా ‘అబ్బబ్బబ్బా’ అంటూ తన ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ను చెప్పి అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడు కేక్‌ తినిపిస్తున్నప్పుడు చెమ్మగిల్లిన కళ్లతో భావోద్వేగానికి లోనయ్యారు సుధాకర్‌. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ.. నవ్విస్తూ ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..