Shane Warne: షేన్ వార్న్ బయోపిక్ షూట్‌లో అపశ్రుతి.. శృంగార సన్నివేశాలు చేస్తూ ఆస్పత్రి పాలైన యాక్టర్స్
షేన్ వార్న్.. క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్ బౌలర్‌గా పేరుగాంచిన అతను గతేడాది ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో వార్న్ చెరగని ముద్ర వేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 1000కి పైగా వికెట్లు తీశాడు.
షేన్ వార్న్.. క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్ బౌలర్‌గా పేరుగాంచిన అతను గతేడాది ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో వార్న్ చెరగని ముద్ర వేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో, వన్డేల్లో కలిపి 1000కి పైగా వికెట్లు తీశాడు. తన స్పిన్ మాయాజాలతో ఆసీస్ జట్టుకు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు షేన్ వార్న్. అయితే ఆటతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలిచాడు వార్న్. జల్సా రాయుడిగా పేరున్న ఈ స్పిన్ దిగ్గజం పలువురితో అఫైర్లు నడిపాడు. క్రికెట్‌లో రారాజుగా ఎదిగినా పర్సనల్ లైఫ్‌లో అంతే వివాదాస్పదంగా మారాడు. ఈక్రమంలో షేన్ వార్న్ జీవిత కథ ఆధారంగా ఇప్పుడు ఓ సినిమా రూపొందుతోంది. ‘వార్నీ’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆసీస్ స్పిన్ దిగ్గజం జీవితంలోని అన్ని ముఖ్యమైన విషయాలను చూపించనున్నారు. అంటే క్రికెట్‌లో వార్న్ ఎదిగిన తీరు, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న వివాదాలను ఇందులో చూపించనున్నారన్నమాట.
బెడ్ మీద పడబోయి..
వార్నీ సినిమాలో అలెక్స్ విలియమ్స్ షేన్ వార్న్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అతని సతీమణి సిమోన్ పాత్రలో మార్నీ కెన్నెడీ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. షూట్‌లో భాగంగా ఇంటిమేట్ సీన్స్ షూట్ చేయల్సి వచ్చింది. అయితే అది కాస్తా గాడి తప్పడంతో అలెక్స్, కెన్నెడీ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అలెక్స్ తలకు గాయం కాగా.. కెన్నెడీ మణికట్టుకు దెబ్బ తగిలింది. దీనిపై స్పందించిన కెన్నెడీ.. ‘షేన్, సిమోన్ టీనేజ్‌లో ఉన్న సమయంలో ఓ ఇంటిమేట్ సీన్స్‌ను చిత్రీకరించాల్సి ఉంది. ఇందు కోసం మేం కారిడార్‌లో నడుస్తూ వెళ్లాలి. అక్కడి నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడున్న బెడ్‌పై పడిపోవాలి. కానీ మేం బెడ్‌పై కాకుండా కింద పడిపోయాం. దీంతో అలెక్స్ తలకు, నా మణికట్టుకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే సిబ్బంది మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే షూటింగ్ కాస్ట్యూమ్స్ లోనే మమ్మల్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో మమ్మల్ని వింతగా చూశారు’ అని కెన్నడీ చెప్పుకొచ్చింది.
మరిన్నిక్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..