Shaitan OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సైతాన్‌’.. ఎక్కడ చూడొచ్చంటే?

పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర సినిమాలతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహి. వి. రాఘవ. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లలాగే ఆయన కూడా ఓటీటీల బాట పట్టారు. 'సేవ్‌ ది టైగర్స్‌' పేరుతో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సిరీస్‌నుతెరకెక్కించి మంచి హిట్‌ కొట్టారు. తాజాగా ఆయన 'సైతాన్‌' అంటూ మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

Shaitan OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంట్రెస్టింగ్ అండ్ బోల్డ్‌ వెబ్‌ సిరీస్‌ 'సైతాన్‌'.. ఎక్కడ చూడొచ్చంటే?
Shaitan Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jun 15, 2023 | 3:47 PM

పాఠశాల, ఆనందోబ్రహ్మ, యాత్ర సినిమాలతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మహి. వి. రాఘవ. ఆ తర్వాత చాలామంది డైరెక్టర్లలాగే ఆయన కూడా ఓటీటీల బాట పట్టారు. ‘సేవ్‌ ది టైగర్స్‌’ పేరుతో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ సిరీస్‌నుతెరకెక్కించి మంచి హిట్‌ కొట్టారు. తాజాగా ఆయన ‘సైతాన్‌’ అంటూ మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీజర్‌, ట్రైలర్‌తోనే అందరి నోళ్లలో నానిన ఈ సిరీస్‌లో బోల్డ్‌ సీన్స్‌, బూతు పదాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే సిరీస్‌కు ముందే ఈ విషయంపై ప్రేక్షకులకు హెచ్చరికలు జారీ చేశాడు డైరెక్టర్‌ మహి. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా సైతాన్‌ సిరీస్‌ను రూపొందించినట్లు, అది కూడా ఒక సెక్షన్‌ ఆడియెన్స్‌ కోసమే ఈ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ చెప్పుకొచ్చారు. అలా రిలీజ్‌కు ముందే ఎంతో హైప్‌ క్రియేట్‌ చేసిన సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్ని ప్లస్ హాట్ స్టార్‌లో ఇవాళ్టి (జూన్‌ 15) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.

కాగా రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన సైతాన్‌ వెబ్‌ సిరీస్‌లో దేవ‌యాని శర్మ, కామాక్షి భాస్కర్ల, రిషీ, అనిషా దామా, నితన్‌ ప్రసన్న, జాఫర్‌ సాధిఖ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి క్రైమ్‌ థ్రిల్లర్లను ఇష్టపడేవారు సైతాన్‌ సిరీస్‌పై ఓ లుక్కేసుకోండి. ఇందులో బోల్డ్‌ సీన్స్‌, హింస, బూతు పదాలు ఎక్కువగా ఉన్నందున ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.