Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intinti Ramayanam: అప్పుడే ఓటీటీలోకి వస్తోన్న ‘ఇంటింటి రామాయణం’.. ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన కథ. ఆ కుటుంబం అనుకోని సమస్యలో పడుతుంది. తమ కుటుంబానికి ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. దీంతో ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగున్న అసలు రూపాలన్నీ బయటకు రావడం జరుగుతుంది.

Intinti Ramayanam: అప్పుడే ఓటీటీలోకి వస్తోన్న 'ఇంటింటి రామాయణం'.. ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..
Intinti Ramayanam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 15, 2023 | 5:02 PM

సూపర్ హిట్ సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గేమ్ షోస్.. టాక్ షోలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఓటీటీ మాధ్యమం ఆహా. అన్ని భాషలలో హిట్ చిత్రాలను తెలుగులోకి డబ్ చేసి మరీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అంతేకాకుండా.. ఒరిజినల్ చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల విడుదలైన సత్తిగాని రెండెకరాలు సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యింది. సీనియర్ నటుడు నరేష్, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఇంటింటి రామాయణం సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. డైరెక్టర్ సురేష్ నారెడ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించారు. జూన్ 9న విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఇక ఇప్పుడు ఆ సినిమా ఆహాలో జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు మేకర్స్.

కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన కథ. ఆ కుటుంబం అనుకోని సమస్యలో పడుతుంది. తమ కుటుంబానికి ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. దీంతో ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగున్న అసలు రూపాలన్నీ బయటకు రావడం జరుగుతుంది. అయితే ఆ కుటుంబం మొత్తం కలిసి ఆ సమస్య నుంచి బయటపడేందుకు వారంతా ఏం చేశారు అనేదానిపై కథ సాగుతుంది. ఈ సినిమాను పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథగా రూపొందించారు. ఈ చిత్రానికి కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

జూన్ 9న థియేటర్లలో విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే విడుదలైన వారం రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..