AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kabali Movie: ‘కబాలి’ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం ..

హైదరాబాద్ లో పలువురికి డ్రగ్స్ అమ్ముతున్న కేపీ చౌదరిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ చౌదరిని అరెస్ట్ చేయగా.. నైజీరియాకు చెందిన గాబ్రియేల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Kabali Movie: 'కబాలి' తెలుగు సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం ..
Kp Chowdary
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 14, 2023 | 2:44 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. తాజాగా డ్రగ్స్ విక్రయం కేసులో ‘కబాలి‘ చిత్ర నిర్మాత కృష్ణప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 78 లక్షల రూపాయల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో నైజీరియన్ గాబ్రియేల్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పలువురికి డ్రగ్స్ అమ్ముతున్న కేపీ చౌదరిని బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేపీ చౌదరిని అరెస్ట్ చేయగా.. నైజీరియాకు చెందిన గాబ్రియేల్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా బోనకల్ ప్రాంతానికి చెందిన కేపీ చౌదరి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాల్ సినిమా తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా.. పలు తెలుగు, తమిళ్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం తదితర చిత్రాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. గోవాలి OHM క్లబ్‌ నడుపుతోన్నారు కేపీ చౌదరి.

ఇవి కూడా చదవండి

కొంతమంది సెలబ్రిటీలను గోవా తీసుకెళ్లిన కేపీ చౌదరి.. అక్కడ డ్రగ్స్  ఉపయోగించడమే కాకుండా తనతో పాటు ఏప్రిల్‌లో 100 ప్యాకెట్లలో డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.