Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోలతో అల్లు అర్జున్.. హృతిక్ రోషన్‏కు బన్నీ ఆత్మీయ ఆలింగనం..

ముగ్గురు స్టార్స్ ఒకేచోట చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబాయిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగ్గా... బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా.. పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలలో అమీర్ ఖాన్, అనిల్ కపూర్, జాకీష్రాఫ్ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్ వేడుకను గ్రాండ్ నిర్వహించారు.

Allu Arjun: బాలీవుడ్ స్టార్ హీరోలతో అల్లు అర్జున్.. హృతిక్ రోషన్‏కు బన్నీ ఆత్మీయ ఆలింగనం..
Allu Arjun, Hrithik Roshan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 12, 2023 | 2:47 PM

పుష్ప సినిమాతో సౌత్ ఇండియాలో కాదు.. నార్త్ ఇండియాలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీతో ఉత్తరాదిలో బన్నీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. బన్నీ స్టైల్, యాటిట్యూడ్‏కు బాలీవుడ్ సినీ ప్రియులు ముగ్దులయ్యారు. అంతేకాకుండా.. ఇప్పుడు పుష్ప 2 కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోస్ అమీర్ ఖాన్, హృతిక్ రోషన్‏లతో కలిసి బన్నీ ఓ పార్టీలో సందడి చేశారు. వీరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్న వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముగ్గురు స్టార్స్ ఒకేచోట చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ముంబాయిలో వీరి వివాహం గ్రాండ్ గా జరగ్గా… బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా.. పలువురు సినీతారలు హాజరయ్యారు. ఈ వేడుకలలో అమీర్ ఖాన్, అనిల్ కపూర్, జాకీష్రాఫ్ లాంటి స్టార్స్ పాల్గొన్నారు. తాజాగా వీరి పెళ్లి రిసెప్షన్ వేడుకను గ్రాండ్ నిర్వహించారు.

ఈ వేడుకలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం విచ్చేశారు. స్టైలీష్ లుక్‏లో పుష్ప రాజ్ ఈ వేడుకలలో సందడి చేశారు. అనంతరం అక్కడే ఉన్న అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో కరచాలనం చేశారు. అనంతరం వారితో సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. బన్నీని చూసిన బాలీవుడ్ స్టార్ అప్యాయంగా పలకరించాగా.. హృతిక్ బన్నీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బన్నీ, హృతిక్ కలిస్తే చూసేందుకు బాగుందని.. వీరిద్దరు కలిసి నటించడం చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా, అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన టీజర్ మరోసారి సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక మరోవైపు హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం వార్ 2 సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.