Pragathi: ఆ స్టార్ కమెడియన్ అలా ప్రవర్తించడంతో షాక్‌కు గురయ్యా.. అన్నం కూడా తినలేకపోయా: ప్రగతి
సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. బయటకు ఎంతో అందంగ కనిపించే ఈ రంగంలో మనకు తెలియనీ ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పురుషాధిక్యం ఎక్కువగా ఉండే సినిమా పరిశ్రమలో హీరోయిన్లు నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాల్సిందే. ఇక అన్ని రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా వేధింపులు ఉంటాయి.

సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. బయటకు ఎంతో అందంగ కనిపించే ఈ రంగంలో మనకు తెలియనీ ఎన్నో చీకటి కోణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా పురుషాధిక్యం ఎక్కువగా ఉండే సినిమా పరిశ్రమలో హీరోయిన్లు నిలదొక్కుకోవాలంటే ఎంతో కష్టపడాల్సిందే. ఇక అన్ని రంగాల్లో ఉన్నట్లే ఇక్కడ కూడా వేధింపులు ఉంటాయి. చాలామంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. దర్శక నిర్మాతల చేతిలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. ఈక్రమంలో సినిమా ఇండస్ట్రీలో తాను కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానంటోంది ప్రముఖ నటి ప్రగతి. అమ్మగా, అత్త పాత్రల్లో నటిస్తూ తెలుగు తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఓ సినిమా సెట్‌లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్లు వాపోయింది. ఒక స్టార్ కమెడియన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ‘ సినిమా ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ కమెడియన్. సెట్‌లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా కూడా ఉంటారు. అయితే ఒకరోజు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నేను దానిని జీర్ణించుకోలేకపోయారు. ఆ రోజు నాకు ఏ పని చేయాలనిపించలేదు. అన్నం కూడా తినలేకపోయా. చివరకు టీకూడా తాగాలనిపించలేదు’
షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్‌లోకి ఆయనను తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా. నేను అక్కడే రియాక్ట్ అయి ఉంటే మీ పరిస్థితి ఏంటని నిలదీశాను. మీరు కాబట్టే నేను సైలెంట్‌గా ఉండిపోయాను’ అని తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చారు ప్రగతి. అయితే ఆమె పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం రివీల్ చేయలేదు. కాగా గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లి సందడి తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.




Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




