AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pelli Sandadi: పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్‌ కలల రాకుమారి గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి

ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్ సరసన రవళి, దీప్తి భట్నాగర్‌ కథానాయికలుగా నటించారు. ఇక శ్రీకాంత్‌ కలలో కనిపించే దీప్తి భట్నాగర్ నిజ జీవితంలోనూ కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది అప్పట్లో. ఆమె అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు.

Pelli Sandadi: పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్‌ కలల రాకుమారి గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూడండి
Pelli Sandadi Movie
Basha Shek
|

Updated on: Jun 11, 2023 | 7:20 AM

Share

శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచింది. 1990ల్లో విడుదలైన ఈ సినిమా చూసేందుకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ పోటెత్తారు. ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీకాంత్ సరసన రవళి, దీప్తి భట్నాగర్‌ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్‌ కలలో కనిపించే దీప్తి భట్నాగర్ నిజ జీవితంలోనూ కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది అప్పట్లో. ఆమె అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. తెలుగులో పెళ్లి సందడినే దీప్తికి మొదటి సినిమా. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. నాగార్జున ఆటో డ్రైవర్‌, బాలకృష్ణ, సుల్తాన్‌, రాజశేఖర్‌ అన్నయ్య, మోహన్‌ బాబు కొండవీటి సింహాసనం సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది దీప్తి. తెలుగులో కంటే హిందీ సినిమాల్లోనే ఎక్కువగా కనిపించిందామె. కాగా 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ సినిమా తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైందీ అందాల తార.

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ఆర్యతో కలిసి పెళ్లిపీటలెక్కింది దీప్తి భట్నాగర్. వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు. కాగా సినిమాల్లో ఉండగానే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె కొన్ని టీవీ షోలను రూపొందించింది. ఇప్పటికీ తన ప్రొడక్షన్‌ బ్యానర్‌లో షోలను నిర్మిస్తోందీ అందాల తార. కాగా సుమారు పదేళ్లకు దూరంగా ఉన్న దీప్తి భట్నాగర్‌ 2021లో రిలీజైన పెళ్లిసందD సినిమాలో ఓ క్యామియో రోల్‌లో కనిపించి సందడి చేసింది. సినిమాల్లో కనిపించకపోయినా సోషల్‌ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది దీప్తి. తన లేటెస్ట్ ఫొటోస్‌, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. అప్పట్లో సన్నగా, నాజూకుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్త బొద్దుగా తయారైంది. అయితే అందంలో మాత్రం ఏ తేడాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!