AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Addateegala : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ‘అడ్డ తీగల’.. సైకో అండ్‌ రోడ్‌ థ్రిల్లర్‌ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

సస్పెన్స్‌, క్రైమ్‌ అండ్‌ థ్రిల్లర్‌ సినిమాలను చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా పెద్ద ఎత్తున ఈ జోనర్‌ సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తుంటాయి. అలా ఒక సస్పెన్స్‌ క్రైమ్ థ్రిల్లర్‌ తాజాగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా పేరు అడ్డ తీగల.

Addateegala : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న 'అడ్డ తీగల'.. సైకో అండ్‌ రోడ్‌ థ్రిల్లర్‌ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Addateegala Movie
Basha Shek
|

Updated on: Jun 10, 2023 | 6:20 AM

Share

సస్పెన్స్‌, క్రైమ్‌ అండ్‌ థ్రిల్లర్‌ సినిమాలను చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా పెద్ద ఎత్తున ఈ జోనర్‌ సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తుంటాయి. అలా ఒక సస్పెన్స్‌ క్రైమ్ థ్రిల్లర్‌ తాజాగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా పేరు అడ్డ తీగల. బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అర్జున్ కల్యాణ్, ప్రముఖ యూట్యూబర్‌ వాసంతి కృష్ణన్‌ ఈ మూవీలో జంటగా నటించారు. శ్రీ శృంఖలా దేవి ఫిలిమ్స్ బ్యాపర్‌పై రాధికా రామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మీడియా గ్రాఫిక్స్ విభాగంలో విశేష అనుభవమున్న గాదిరాజు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజానికి చాలా రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అయితే కొన్ని కారణాలతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు అడ్డతీగల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా డైరెక్టుగా ఓటీటీలోనే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహాలో శుక్రవారం (జూన్ 9) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథ విషయానికొస్తే.. ఒక సాఫ్ట్ వేర్ జంట వీకెండ్ కోసం అడ్డతీగల , మారేడుమల్లి అటవీ ప్రాంతానికి వెళతారు. అక్కడ వాళ్లకు భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఓ సీరియల్ కిల్లర్ వారి వెంటపడతాడు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వీళ్ల వెంట ఎందుకు పడతాడు. చివరకు ఏమైంది అన్నది సస్పెన్స్‌. రోడ్ ట్రిప్, సీరియల్ కిల్లింగ్‌ వంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన అడ్డతీగల సినిమాపై ఇంట్లోనే కూర్చొని ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అదొక మనసు - మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు..
అదొక మనసు - మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు..
మేడారం జాతరకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచంటే..?
మేడారం జాతరకు వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచంటే..?
అట్టర్ ఫ్లాప్ షోకు ఏకంగా లక్షల్లో శాలరీ.. ఒక్కో పరుగుకు ఎంతంటే?
అట్టర్ ఫ్లాప్ షోకు ఏకంగా లక్షల్లో శాలరీ.. ఒక్కో పరుగుకు ఎంతంటే?
4 గంట్లోనే ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే
4 గంట్లోనే ఊహించని రీతిలో పెరిగిన బంగారం, వెండి ధరలు..తులం ఎంతంటే
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న