Kerala Crime Files: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్.. ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ప్రస్తుతం ఓటీటీ లవర్స్ దృష్టి మహి. వి. రాఘవ్ 'సైతాన్' క్రైమ్ సిరీస్‌పైనే ఉంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. అదే 'కేరళ క్రైమ్ ఫైల్స్'. అహ్మద్ కబీర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రముఖ మలయాళ నటుడు లాల్, అజు వర్గీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీలో రిలీజయ్యే సిరీస్‌లకు ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది. చాలామంది వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్‌లకు ఓటీటీలో బాగా ఆదరణ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఓటీటీ వేదికలు ఆసక్తికరమైన కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ లవర్స్ దృష్టి మహి. వి. రాఘవ్ ‘సైతాన్’ క్రైమ్ సిరీస్‌పైనే ఉంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. అదే ‘కేరళ క్రైమ్ ఫైల్స్’. అహ్మద్ కబీర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రముఖ మలయాళ నటుడు లాల్, అజు వర్గీస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజైంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఒక లాడ్జ్‌లో జరిగిన హత్యను ఛేదించడానికి రంగంలోకి దిగిన ఆరుగురు పోలీస్ అధికారులు ఏం చేశారు? అసలు ఈ హత్యను ఎవరు చేశారు? లాడ్జీ రిజిష్టర్‌లో ఉన్న షిజు, పరయల్ వీడు, నీందకర అనే క్లూను పోలీసులు ఎలా ఛేదించారు? ఇలా ఆసక్తికరంగా సాగింది కేరళ క్రైమ్ ఫైల్స్ ట్రైలర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్ జూన్ 23 నుంచి ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, భాషల్లోనూ కేరళ క్రైమ్ ఫైల్స్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది డిస్నీ+హాట్‌స్టార్. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ 30 నిమిషాల పాటు ఉండనుంది.
‘Kerala Crime Files’ – Shiju, Parayil Veedu, Neendakara’ trailer is out now. Streaming from June 23rd in Malayalam in Hindi, Tamil, Telugu, Malayalam, Kannada, Bengali & Marathi#KeralaCrimeFiles #ShijuParayilVeeduNeendakara #HotstarSpecials #DisneyPlusHotstar #AjuVarghese #Lal pic.twitter.com/c8DEX4DDHg
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..