AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custody OTT: ఓటీటీలోకి వచ్చేసిన చైతూ రీసెంట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ .. ‘కస్టడీ’ మూవీని ఎందులో చూడొచ్చంటే?

మే 12 న థియేటర్లలో విడుదలైన కస్టడీ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఓ మోస్తరుగా మాత్రమే వసూళ్లు వచ్చాయి. అయితే కాప్‌ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్‌ అదిరిపోయింది. అలాగే సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు టేకింగ్‌ చాలా బాగున్నాయని రివ్యూస్‌ వచ్చాయి.

Custody OTT: ఓటీటీలోకి వచ్చేసిన చైతూ రీసెంట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ .. 'కస్టడీ' మూవీని ఎందులో చూడొచ్చంటే?
Custody Ott
Basha Shek
|

Updated on: Jun 09, 2023 | 5:55 AM

Share

థాంక్యూ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కస్టడీ’. కోలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయికగా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ సినిమాను నిర్మించారు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్‌బాయ్‌గానే కనిపించిన చైతూ ఇందులో మొదటిసారిగా పోలీస్‌గా కనిపించారు. మే 12 న థియేటర్లలో విడుదలైన కస్టడీ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఓ మోస్తరుగా మాత్రమే వసూళ్లు వచ్చాయి. అయితే కాప్‌ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్‌ అదిరిపోయింది. అలాగే సినిమాలోని యాక్షన్‌ సీక్వెన్స్‌, డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు టేకింగ్‌ చాలా బాగున్నాయని రివ్యూస్‌ వచ్చాయి. దీంతో అక్కినేని అభిమానులు కస్టడీ ఓటీటీ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక బుధవారం (జూన్‌ 7) నాగచైతన్య సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈక్రమంలో జూన్‌ 9 (శుక్రవారం అర్ధరాత్రి) నుంచే కస్టడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కస్టడీ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్‌జీ అమరన్ తదితరులు కీలక పాత్రలు కనిపించారు. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి థియేటర్లలో కస్టడీ సినిమాను మిస్‌ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..