Avatar 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవతార్‌ 2 .. తెలుగు వెర్షన్‌ కూడా ఫ్రీగానే చూడొచ్చు.. ఎక్కడంటే?

థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన అవతార్‌ 2 ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందుకు తగ్గట్లే నెల రోజుల క్రితమే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్‌ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే సినిమా చూడాలంటే రెంటల్ విధానంలో భారీగా డబ్బులు చెల్లించాలన్న..

Avatar 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన అవతార్‌ 2 .. తెలుగు వెర్షన్‌ కూడా ఫ్రీగానే చూడొచ్చు.. ఎక్కడంటే?
Avatar 2
Follow us
Basha Shek

|

Updated on: Jun 08, 2023 | 6:20 AM

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన మరో విజువల్‌ వండర్‌.. ‘అవతార్‌- ది వే ఆఫ్‌ వాటర్‌ (అవతార్‌ 2). గతేడాది డిసెంబర్‌ 16న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 160కు భాషల్లో పైగా విడుదలైన ఈ సినిమా రెండు బిలియన్‌ డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ.16, 423 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన అవతార్‌ 2 ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందుకు తగ్గట్లే నెల రోజుల క్రితమే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు వెర్షన్‌ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే సినిమా చూడాలంటే రెంటల్ విధానంలో భారీగా డబ్బులు చెల్లించాలన్న నిబంధన అమలు చేసింది సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌. అయితే ఇప్పుడా నిబంధనను ఎత్తేసింది. బుధవారం (జూన్ 7) నుంచి ఫ్రీగా చూసే సదుపాయం కల్పించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన వెలువరించింది.

సాధారణంగా మన సినిమాలు, సిరీస్ లు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతాయి. అయితే అవతార్ 2 మాత్రం ఈస్టర్న్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం రాత్రి 3 గంటలకు, పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమ్ అవుతాయి. పసిఫిక్ స్టాండర్డ్ టైమ్ కంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ 12.30 గంటలు ముందు ఉంటుంది. అందుకే అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో బుధవారం (జూన్ 7) మధ్యాహ్నం 12.30 గంటల నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. సాధారణంగా ఓ సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత గరిష్ఠంగా 90 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. అయితే అవతార్‌ 2 మాత్రం సుమారు 173 రోజుల తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. మరి థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..