- Telugu News Photo Gallery Cinema photos Do You Know What Is The Favourite Megastar Movie For Jr NTR?
Jr NTR: మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన మూవీ ఏదో తెలుసా?
ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఎక్కువగా తన తాత, బాబాయ్ సినిమాలు చూస్తూనే పెరిగానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు తారక్.
Updated on: Jun 07, 2023 | 7:15 AM

ఆర్‌ఆర్‌ఆర్‌తో పాన్ ఇండియా హీరోగా ప్రమోషన్ పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా ఎక్కువగా తన తాత, బాబాయ్ సినిమాలు చూస్తూనే పెరిగానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు తారక్. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా అంటే తనకెంతో ఇష్టమంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

ఆ సినిమా మరేదో కాదు రుద్రవీణ. 'చిరంజీవి గారు నటించిన రుద్రవీణ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. ఆయన ఓ స్టార్ హీరో అయిండి కూడా.. అలాంటి సినిమా చేయటానికి అంగీకరించారు. ఓ నటుడికి ఉండాల్సిన తృష్ణ అది. మనలోని నటుడ్ని సంతృప్తి పరచటం చాలా కష్టమైన పని' అని తారక్ చెప్పుకొచ్చాడు.

రుద్రవీణ సినిమాకు ఎన్నో అవార్డులు, ప్రశంసలు వచ్చాయి. అయితే కమర్షియల్‌గా మాత్రం హిట్ కాలేకపోయింది. అయితే చిరంజీవి సినిమా కెరీర్‌లో మరుపురాని చిత్రంగా మిగిలిపోయింది.

1988లో విడుదలైన రుద్రవీణలో చిరంజీవి సామాజిక సమస్యలపై పోరాడే సూర్యం అనే యువకుడి పాత్రలో నటించారు. బాలచందర్ తెరకెక్కించిన ఈ సినిమాలో శోభన హీరోయిన్‌గా నటించింది. చిరంజీవి రెగ్యులర్ స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సినిమాలో ఎలాంటి కమర్షియల్ హంగులు, ఫైట్లు ఉండవు.





























