శుభవార్త చెప్పిన ‘బిగిల్‌’ గుండమ్మ.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న లేడీ కమెడియన్‌.. వరుడు ఎవరో తెలుసా?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన బిగిల్‌ భారీ హిట్‌ సాధించింది. తెలుగులోనూ విజిల్‌ పేరుతో రిలీజైన ఈ సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ డబుల్‌ రోల్‌ పోషించగా, నయనతార హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమాలో విజయ్‌ వుమెన్స్‌ టీమ్‌ సాకర్‌ కోచ్‌గా నటించారు.

శుభవార్త చెప్పిన 'బిగిల్‌' గుండమ్మ.. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న లేడీ కమెడియన్‌.. వరుడు ఎవరో తెలుసా?
Indraja Shankar
Follow us
Basha Shek

|

Updated on: Jun 07, 2023 | 6:05 AM

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన బిగిల్‌ భారీ హిట్‌ సాధించింది. తెలుగులోనూ విజిల్‌ పేరుతో రిలీజైన ఈ సినిమాకు సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాలో విజయ్‌ డబుల్‌ రోల్‌ పోషించగా, నయనతార హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమాలో విజయ్‌ వుమెన్స్‌ టీమ్‌ సాకర్‌ కోచ్‌గా నటించారు. మహిళల పుట్‌బాల్‌ టీమ్‌లో ప్రముఖ నటీమణులు కనిపించారు. అందులో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఇంద్రజ. అయితే ఈ పేరు వింటే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుండమ్మ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ పాత్ర జనాల్లోకి వెళ్లిపోయింది. తమిళనాట అయితే పుట్‌బాల్‌ పాండియమ్మ పాత్ర పేరు మార్మోగిపోయింది. విజిల్‌ తర్వాత సర్వైవర్‌ అనే షోలోనూ పాల్గొంది ఇంద్రజ. ఆ తర్వాత కార్తీ విరుమాన్‌ సహా పలు సినిమాల్లో నటించి తమిళనాట ట్యాలెంటెడ్‌ కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఒక శుభవార్త చెప్పింది. తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టుతున్నట్లు పేర్కొంది. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలిపిన ఇంద్రజ తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఇంద్రజ ఏడడుగులు నడుస్తున్నది ఎవరో తెలుసా.. తరచూ ఆమెతో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ చేస్తోన్న డైరెక్టర్‌ శంకర్‌తోనే తన జీవితాన్ని పంచుకోనుందీ లేడీ కమెడియన్‌. ఈ మేరకు తనకు కాబోయే భర్తతో ఇంద్రజ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు ఇద్దరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘పెళ్లెప్పుడు’ అని నెటిజన్లు అడగ్గా.. ‘ పెళ్లికి ఇంకా ముహూర్తం పెట్టలేదని, ఆ పని పూర్తవగానే త్వరలోనే వెడ్డింగ్‌ డేట్‌ చెప్తానంది. కాగా ఇంద్రజ తండ్రి మరెవరో కాదు రోబో సినిమాలో రజనీకాంత్‌ పక్కన నటించిన శంకర్‌. ఈ సినిమాతోనే రోబో శంకర్‌గా మారిపోయాడాయన. ధనుష్‌ మారి, సూర్య సింగం 3, విశ్వాసం, కోబ్రా, అన్నాత్తై, తదితర హిట్ సినిమాల్లో కమెడియన్‌గా మెప్పించారాయన.

View this post on Instagram

A post shared by Ani Anish (@anianishh)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అయ్యో పాపం..ఎర అనుకుని ఎగిరే డ్రోన్‌ను మింగేసిన మొసలి..! ఆ తర్వాత
అయ్యో పాపం..ఎర అనుకుని ఎగిరే డ్రోన్‌ను మింగేసిన మొసలి..! ఆ తర్వాత
టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
టీ20ల్లో అదరగొట్టిన ముగ్గురు ప్లేయర్లు.. లిస్టులో మనోడు
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
ఎంతటి డిప్రెషన్‌ అయినా తగ్గించే ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్..
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
మహిళలకు ఉచిత బస్ పథకంపై కీలక అప్‌డేట్
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
ఇద్దరు పిల్లల తండ్రిని ప్రేమించిన ముగ్గురు పిల్లల తల్లి.. చివరకు
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?