Kevvu Karthik: ‘చూడముచ్చటైన జంట’.. ఎట్టకేలకు కాబోయే భార్యను పరిచయం చేసిన ‘జబర్దస్త్‌’ కెవ్వు కార్తీక్

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్‌ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు.

Kevvu Karthik: 'చూడముచ్చటైన జంట'.. ఎట్టకేలకు కాబోయే భార్యను పరిచయం చేసిన 'జబర్దస్త్‌' కెవ్వు కార్తీక్
Kevvu Karthik
Follow us
Basha Shek

|

Updated on: Jun 04, 2023 | 1:15 PM

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్ త్వరలోనే ఓ ఇంటివాడుకాబోతున్నాడు. ప్రస్తుతం జబర్దస్త్‌లో టీమ్‌ లీడర్‌గా కొనసాగుతున్న అతను త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు. ‘మీ జీవితంలోకి ఒక కొత్త పర్సన్‌ వస్తే.. లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొందరు అంటుంటారు. బహుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ సోషల్‌ మీడియా ద్వారా శుభవార్తను పంచుకున్నాడు కార్తీక్. అయితే ఇందులో తనకు కాబోయే భార్య ముఖాన్ని మాత్రం చూపించలేదు. పైగా అమ్మాయి వివరాలు చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచాడు. అయితే తాజాగా మరోసారి తాను చేసుకోబోయే అమ్మాయిని పరిచయం చేశాడు కార్తీక్‌. ఇన్‌స్టాలో తనకు కాబోయే భార్యతో కలిసున్న ఫొటోలను పంచుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌ ఓ ఎమోషనల్‌ నోట్‌ కూడా రాసుకొచ్చాడు. ఫైనల్‌గా నేను చేసుకోబోయే అమ్మాయి. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని విన్నా. కానీ ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. రెండు భిన్నమైన మనసులు, భిన్నమైన జీవితాలు, భిన్నమైన అభిప్రాయాలు, విభిన్న ప్రపంచాలు జీవిత ప్రయాణమనే పుస్తకంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు ఒకే హృదయంగా మారుతున్నాయి.. వెల్‌కమ్‌ టూ మై లైఫ్ సిరి.’ అంటూ తనకు కాబోయే భార్యను ఇంట్రడ్యూస్‌ చేశాడు కార్తీక్.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యానీ మాస్టర్‌ లాంటి సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కెవ్వు కార్తీక్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా యాక్టింగ్‌ మీద ఇంట్రెస్ట్‌తో మంచి ఉద్యోగం వదులుకుని మరీ ఇండస్ట్రీలోకి వచ్చాడు కార్తీక్. తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను ఇంజనీరింగ్‌ చదువుతూనే మిమిక్రీలో డిప్లొమా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంటెక్‌ చేసి మంచి ఉద్యోగం సంపాదించాడు. అయితే మిమిక్రీ, నటనపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. హైదరాబాద్‌ వచ్చి మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజీ షోలు చేశాడు. అనంతరం కామెడీ క్లబ్‌, జబర్దస్త్‌ షోల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్‌లో మొదట ఒక టీమ్‌లో మెంబర్‌గా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్‌ ఆతర్వాత తన ట్యాలెంట్‌తో టీమ్‌ లీడర్‌గా ఎదిగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!