AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్‏లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమకు బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేసింది ఆయనే. ఆ తర్వాత అదే స్థాయిలో పవర్ ఫుల్ స్టెప్పులతో, ఎనర్జిటిక్ డ్యాన్సులతో మెప్పిస్తున్నారు యంగ్ హీరో.. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ డ్యాన్స్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్‏లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..
Peddi Second Single
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2026 | 11:00 AM

Share

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా..జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకు విడుదలైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాటకు చరణ్ హుక్ స్టెప్ నెట్టింట ఏ స్థాయిలో పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా పెద్ది సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

తాజాగా సోమవారం ఈ మూవీ నుంచి రై రై రారా అనే లిరికల్ వీడియోను ఐదు భాషలలో విడుదల చేశారు మేకర్స్. “రై రై రారా.. రై రై రారా.. అడ్డేలేని దారై రారా.. అడ్డేలేని తీరై రారా” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. ఈ పాటను ఏఆర్ రెహమాన్ ఆలపించారు. గీత రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. ట్యూన్ కు తగినట్లుగా లిరిక్స్ రాయడమే కాకుండా ఈ పాట ద్వారా మోటివేషనల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పాటలో వచ్చిన లిరిక్స్ ఆద్యంతం మోటివేషనల్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

ఇక ఇందులో రామ్ చరణ్ తన మాస్ ఎనర్జిటిక్ స్టెప్పులతో, గ్రేస్ ఫుల్ డ్యాన్సులతో అదరగొట్టారు. కొన్ని స్టెప్పులు చిరుత సినిమాలో చెర్రీని గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా చరణ్ చేసిన స్టైలీష్ స్టెప్పులు, ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..

Follow Us
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
చిరుతను గుర్తు చేసిన రామ్ చరణ్.. పెద్ది సెకండ్ సాంగ్‏..
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
తూటాల వర్షం..రక్తంచిందిన మైదానం..లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17ఏళ్లు
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ..
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
పసిడి, వెండి ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
ఒక్క టూర్‌తో అన్నీ ప్రదేశాలు కవర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజ్
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‏లో నాగార్జున, బాలకృష్ణ.. అత
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
తగ్గేదేలే.. కప్ప పామును వేటాడితే ఎట్టా ఉంటదో తెలుసా..?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి విశ్వక్ సేన్ 'ఫంకీ'..స్ట్రీమింగ్ ఎక్కడంటే?