AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tanikella Bharani: ఆ వార్తలు చూసి షాకయ్యా.. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో తనికెళ్ల భరణి ఒకరు. సుమారు 750కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు. అలాగే మిథునం లాంటి క్లాసిక్ సినిమాకు దర్శకత్వం వహించారీ సీనియర్ యాక్టర్.

Tanikella Bharani: ఆ వార్తలు చూసి షాకయ్యా.. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
Tanikella Bharani
Basha Shek
|

Updated on: Mar 03, 2026 | 10:45 AM

Share

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్లు కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీలు, వారి పర్సనల్ లైఫ్ గురించి రకరకాల వీడియోలు చేస్తున్నారు. అసభ్యకరమైన, అనుచితమైన థంబ్ నెయిల్స్ పెట్టి సినిమా తారల వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత కొన్ని రోజులుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తనికెళ్ల భరణి ఆస్తులు చూస్తే మైండ్ పోవాల్సిందే, ఆయన ఇంటి ముందు అరడజను ఖరీదైన కార్లు ఉన్నాయంటూ కొందరు తప్పుడు వీడియోలు సృష్టించారు. సాధారణంగా సినిమాల సంగతి తప్ప ఇతర విషయాలను పెద్దగా పట్టించుకోరు, మాట్లాడరు భరణి. అలాంటిది ఇప్పుడు తన పై జరుగుతోన్న ప్రచారంపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశారు తనికెళ్ల భరణి.

‘ ఇటీవల నాఆస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు, కానీ ఆ వార్తలు చూసి నేనే షాక్ అయ్యాను. అలాగే నా ఇంటి ముందు ఖరీదైన కార్లు ఉన్నాయని చూపిస్తున్నారు. అందులోనూ ఎలాంటి వాస్తవం లేదు. ఆ వార్తలు చూసి నేను, నా కుటుంబ సభ్యులంతా కలిసి నవ్వుకున్నాం. ఇక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో నేను ఏదో ఒక దేశానికి లేదా ఒక మతానికి మద్దతు ఇస్తున్నట్లు వార్తలు రాశారు. అందులోనూ ఎలాంటి నిజం లేదు. నేను అన్ని మతాలను, అన్ని వర్గాల ప్రజలను సమానంగా గౌరవిస్తాను. ఈ రకమైన తప్పుడు వార్తలు నన్ను నమ్మే మిత్రులను, శ్రేయోభిలాషులను బాధకు గురిచేస్తాయి . అందుకే ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దు. అలాగే వాటిని ఎంకరేజ్ చేయవద్దు’ అని వీడియోలో కోరారు తనికెళ్ల భరణి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీనియర్ నటుడు తనికెళ్ల భరణి రిలీజ్ చేసిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us