AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రాశుల వారు కన్నీళ్లతో కాలం గడపాల్సిందే.. కేతు గ్రహణ యోగం వలన అన్నీ కష్టాలే!

జ్యోతిష్యశాస్త్రంలో కేతు, రాహువు గ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిని నీడ గ్రహాలు అని కూడా అంటారు. ఈ గ్రహాల కదలికలు పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే అతి త్వరలో కేతువు, చంద్ర గ్రహాలు రెండూ కలిసి సింహ రాశిలో సంచరించనున్నాయి. దీని వలన గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా సమస్యలు తీసుకరానున్నది.

Samatha J
|

Updated on: May 13, 2026 | 4:22 PM

Share

1 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి రుణ బాధలు అధికం అవుతాయి. తన సొంత రాశిలోనే కేతు, చంద్ర గ్రహాల కలయిక వలన  ఈ రాశి వారు మే 22 నుంచి అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఎదుటి వారితో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇవి ఇబ్బందులను తీసుకొస్తాయి.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కేతు గ్రహ యోగం వలన భార్య భర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా  అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆర్థికపరమైన సవాళ్లు ఎదురు అవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా చవిచూడాల్సి వస్తుంది. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. అలాగే ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందువలన వీలైనంత వరకు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది.

4 / 5
మీన రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేతు గ్రహణ యోగం వలన వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా వీరు ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం  అవసరం. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి.

5 / 5
Follow Us