చూపుతోనే కట్టిపడేస్తున్న ముద్దుగుమ్మ నివేధా థామస్.. 

Rajeev 

12 May  2026

instagram

నివేధా థామస్.. దక్షిణాది సినీప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది.

అయితే ఈ బ్యూటీకి మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. అయితే ఇటీవలే 35 చిన్న కథ అనే సినిమాలో తల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

ఇన్నాళ్లు గ్లామర్ హీరోయిన్ గా కనిపించిన నివేదా.. తల్లి పాత్రలో నటించి మార్కులు కొట్టేసింది. ఇందులో తన పాత్రకు గానూ ఉత్తమ నటిగా గద్దర్ అవార్డ్ అందుకుంది.

నివేదా థామస్.. కళ్లతోనూ హావభావాలు పలికించగల నటి. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన నిన్ను కోరి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది.

ఆ తర్వాత జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా 35 చిన్న కథ కాదు అనే చిత్రంలో నటించి మెప్పించింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.