ఆ హీరో అంటే చాలా ఇష్టం.. చిన్న ఛాన్స్ వచ్చినా చేస్తా.. శివాని నాగారం

Rajitha Chanti

Pic credit - Instagram

13 May 2026

తెలుగులో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న హీరోయిన్ శివాని నాగారం. 1998 ఆగస్టు 25న హైదరాబాద్‌లో జన్మించిన ఆమె ఇప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్. 

2024లో సుహాస్ హీరోగా వచ్చిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

2025లో వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఇందులో 'కాత్యాయణి' పాత్రలో నటించి విజయాన్ని అందుకుని ఆ పాత్రతోనే ఫేమస్ అయ్యింది. 

 ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో శివాని నాగరం మాట్లాడుతూ.. తనకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని, ఆయనకు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.

కేవలం అభిమానం మాత్రమే కాదు, మహేష్ బాబు సినిమాలో చిన్న అవకాశం వచ్చినా వదులుకోనని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. 

"మహేష్ బాబు సరసన నటించే అవకాశం వస్తే, ఆ సినిమా కోసం నేను ఏమైనా చేస్తాను. కనీసం ఒక్క సీన్‌లో కనిపించే అవకాశం వచ్చినా చాలు" అంటూ ఆమె తన ఆరాధనను చాటుకున్నారు.

ఇటీవల సుహాస్‌తో కలిసి నటించిన హే బలవంత్ చిత్రం కూడా మంచి ఆదరణ పొందింది. ఆమె నటిగానే కాకుండా గాయనిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.

అలాగే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.