తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. 144 మంది సభ్యులు మద్దతుగా నిలవగా, కేవలం 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్, అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ తన పట్టును నిరూపించుకున్నారు.