AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virosh : ఇన్ స్టా గ్రామ్‌లో దుమ్ములేపిన విజయ్ దేవరకొండ, రష్మిక.. గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.. గతకొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న విజయ్ రష్మిక ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగింది

Virosh : ఇన్ స్టా గ్రామ్‌లో దుమ్ములేపిన విజయ్ దేవరకొండ, రష్మిక.. గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జంట
Virosh
Rajeev Rayala
|

Updated on: May 13, 2026 | 6:23 PM

Share

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ ఇద్దరికీ మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా విజయ్, రష్మిక ఓ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. విజయ్ దేవరకొండ, రశ్మిక కలిసి నటిస్తున్న యాడ్స్ ఇన్ స్టాగ్రామ్ లైక్స్ లో గ్లోబల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Suman Setty: ఆ హీరో నన్ను పిలిచి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. అంతకన్నా ఏం కావాలి

ఈ జంటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ఈ లైక్స్ తెలియజేస్తున్నాయి. విరోష్ జోడి ఇటీవల కలిసి చేసిన ఎయిర్ బీఎన్ బీ కపుల్ యాడ్ కు ఇన్ స్టాగ్రామ్ లో 9.1 మిలియన్ పైగా లైక్స్ వచ్చాయి. ఈ లైక్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యాడ్ కు వరల్డ్ వైడ్ గా వచ్చిన సెకండ్ హయ్యెస్ట్ లైక్స్ ఇవే కావడం గమనార్హం. ఫస్ట్ హయ్యెస్ట్ లైక్డ్ పోస్ట్ కూడా విరోష్ చేసిందే కావడం విశేషం. వీరి వెడ్డింగ్ టైమ్ లో ఎండార్స్ చేసిన మాన్యవార్ యాడ్ 11.5 మిలియన్ కు పైగా లైక్స్ తో హయ్యెస్ట్ లైక్డ్ యాడ్ పోస్ట్ గా గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సౌందర్య కాదు.. వెంకటేష్‌తో ఆరు సినిమాలు.. అన్నీ సూపర్ హిట్లే.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ పోస్ట్ కు 104 మిలియన్ వ్యూస్ రావడం మరో రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఫుట్ బాల్ స్టార్స్ మెస్సి, రొనాల్డో కలిసి చేసిన లూయిస్ వ్యూటన్ యాడ్ పోస్ట్ కు మించిన లైక్స్ విరోష్ చేసిన మాన్యవార్ కపుల్ యాడ్ పోస్ట్ కు దక్కాయి. వరల్డ్ వైడ్ సోషల్ మీడియాలో అడ్వర్టయిజింగ్ లో విరోష్ జోడి ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రికార్డ్ స్థాయి లైక్స్ విజయ్, రశ్మిక చేస్తున్న యాడ్స్ కు గ్లోబల్ రీచ్ తీసుకొస్తున్నాయి. విజయ్, రశ్మిక జోడి త్వరలో “రణబాలి” చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన ముందు నిలబడాలన్నా చాలా సిగ్గుపడేదాన్ని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us