వరలక్ష్మి వ్రతంలో బిగ్ బాస్ బ్యూటీ.. కట్టిపడేస్తున్న ఫోటోస్..
Rajitha Chanti
Pic credit - Instagram
21 August 2026
యూట్యూబర్ గా, నటిగా, బిగ్ బాస్ ఫేమ్‌గా టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన అలేఖ్య హారిక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారు.
'దేత్తడి హారిక'గా తనదైన తెలంగాణ యాస, నటనతో కుర్రకారును ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు.
ఈ ప్రత్యేకమైన పండుగ సందర్భంగా అలేఖ్య హారిక ఇంట్లో పవిత్రమైన పూజలు నిర్వహించి, ఆ తర్వాత దిగిన సుందరమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పండుగ వేడుకలో హారిక పక్కా తెలుగుదనంతో నిండిన సాంప్రదాయక హాఫ్ శారీ లుక్‌లో దర్శనమిచ్చారు.
ఎంతో ఆకర్షణీయమైన రంగుల లంగా ఓణీ ధరించి, దానికి తగినట్లుగా సాంప్రదాయ ఆభరణాలు, చెవులకు జుంకీలు, నుదుటన బొట్టుతో ఎంతో ముద్దుగా కనిపిస్తున్నారు.
పూజా క్రతువు పూర్తి చేసుకున్న అనంతరం ఆమె తన ఇంట్లో పూజ గది వద్ద , ఇంటి ప్రాంగణంలో ఆమె ఇచ్చిన క్యూట్ పోజులు ఆకట్టుకుంటున్నాయి.
గ్లామరస్ ఫోటోషూట్‌లతో పాటు తరచూ డిఫరెంట్ లుక్స్‌లో మెరిసే హారిక, ఇలా పండుగ వేళ పద్ధతిగా తెలుగు అమ్మాయిలా హాఫ్ శారీలో కనిపించింది.
నిజంగా లక్ష్మీదేవిలా ఉన్నావు", "పక్కా తెలుగు ఇంటి మహాలక్ష్మి" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తూ లైక్స్ కొడుతున్నారు. ఈ అమ్మడు నెట్టింట చాలా యాక్టివ్.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్